నాని 'హిట్-3'.. టికెట్ రేట్ల సంగతేంటి?
మేకర్స్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. క్రేజీ అప్డేట్స్ తో మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 April 2025 5:00 PM ISTస్టార్ హీరో నాని.. హిట్-3 మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ సినిమా.. హిట్ యూనివర్స్ లో మూడో చిత్రంగా సందడి చేయనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా థియేటర్లలో సందడి చేయనున్న హిట్-3పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మేకర్స్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. క్రేజీ అప్డేట్స్ తో మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా తను సాంగ్ తో పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చారు. ప్రమోషన్స్ లో నాని కీలక పాత్ర పోషించి వరుస ఇంటర్వ్యూస్ తో సందడి చేశారు. మూవీ టీమ్ కూడా బాగానే సందడి చేసింది.
అలా సినిమా కోసం ఈగర్ గా అంతా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో మేకర్స్.. సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఓవర్సీస్ కు అప్పుడే హార్డ్ డిస్కులు పంపేశారు. ఆ తర్వాత రిలీజ్ కు చాలా గ్యాప్ ముందే ఆన్ లైన్ టికెట్ సేల్స్ ను స్టార్ట్ చేశారు.
అయితే తెలంగాణలో ఇప్పుడు మల్టీప్లెక్స్ లో రూ.295.. సింగిల్ స్క్రీన్ లో రూ.175 చొప్పున ధరలు ఉన్నాయి. అవేం మరీ తక్కువ కాదు.. కాబట్టి పెంపు అవసరం లేదు. అందుకే ఆ ధరలను హిట్ -3 మేకర్స్ ఫాలో అవుతున్నారు. అందుకోసం ఎలాంటి పర్మిషన్లను ఎవరూ.. ఎక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ టికెట్ కాస్ట్ రూ.177.. సింగిల్ స్క్రీన్ రూ.110-140 మధ్య ఉన్నాయి. అందుకే రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని సినిమాల మేకర్స్.. టికెట్ రేట్ల పెంపు కోసం జీవో తెచ్చుకున్నారు. మొత్తం కాకపోయినా కొన్ని ప్రాంతాల వరకు పెంచారు. ఇప్పుడు హిట్-3 మేకర్స్ ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అయితే మేకర్స్ కోరితే ఏపీ సర్కార్ అనుమతులు ఇవ్వడం కచ్చితమే. కానీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు అదిరిపోతాయి. రేట్ పెంచారనే రిమార్క్ ఎక్కడా ఉండదు. అదే రిజల్ట్ తేడా కొడితే వేరేలా ఉంటుంది. అయితే సినిమా మాత్రం మాస్ లవర్స్ ను ఓ రేంజ్ లో మెప్పిస్తుందని అంచనాలు ఉన్నాయి. కాబట్టి హిట్ -3 మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
