ది ప్యారడైజ్ ఒక్కో అప్డేట్ ఎలా ఉంటుందంటే..
శైలేష్ కొలను దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన హిట్3 పై అందరికీ మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
By: Tupaki Desk | 26 April 2025 5:00 AM ISTవరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న నాని మరో వారం రోజుల్లో హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిట్3 సక్సెస్ విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాని ఎప్పుడూ తన సినిమాలను ప్రమోట్ చేసినట్టే ఈ సినిమాను కూడా ఎంతో యాక్టివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. కాకపోతే ఇది సొంత బ్యానర్ కావడంతో ఇంకాస్త స్పెషల్ కేర్ తీసుకున్నాడు నాని.
శైలేష్ కొలను దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన హిట్3 పై అందరికీ మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నాని, ఆ ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. యాంకర్ సుమకు నాని ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తన తర్వాతి సినిమా గురించి అదిరిపోయే న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ను ఊరించాడు.
హిట్3 తర్వాత నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నానికి దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఆ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ అంటూ ఓ గ్లింప్స్ రాగా దానికి నాని ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా, సగటు సినీ ప్రేక్షకుడి నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.
యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ది ప్యారడైజ్ గురించి నాని సుమతో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ది ప్యారడైజ్ సినిమా చాలా క్రేజీ సినిమా అని, సినిమా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుందని, ప్యారడైజ్ నుంచి ఏ ఒక్క విజువల్ వచ్చినా అది అందరినీ ఎగ్జైట్ చేయడంతో పాటూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా? ఎప్పుడెప్పుడు టికెట్ కొనుక్కుందామా అనిపించేలా శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడని నాని చెప్పాడు.
ప్రతీ ఒక్కరి లైఫ్ లో లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు కొన్ని ఉంటాయని, ది ప్యారడైజ్ కూడా అలాంటిదేనని, ఆల్రెడీ గ్లింప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా అంతకుమించి ఆడియన్స్ ను శాటిస్‌ఫై చేస్తుందని నాని చెప్పాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
