నాని సుజిత్ స్క్రిప్ట్ లాక్..?
నాని ఎనర్జీకి పర్ఫెక్ట్ గా ప్లస్ అయ్యే కథతో ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెలుస్తుంది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజిత్ ఓజీ తర్వాత మాత్రం నానితో వెంటనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.
By: Tupaki Desk | 4 Jun 2025 9:06 PM ISTహిట్ 3 తో తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్న నాని ఆ సినిమాతో హీరోగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యి డబుల్ ప్రాఫిట్స్ పొందాడు. సరిపోదా శనివారం, హిట్ 3 ఇలా వరుస హిట్లతో నాని బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ ప్లాన్ చేశారు. ఎలాగైనా అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా చూస్తున్నారు. 90ల కాలం లాంటి నేపథ్య కథతో పీరియాడికల్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా ప్యారడైజ్ రాబోతుంది.
ఈ సినిమాలో నాని పాత్ర ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పూర్తయ్యాక నాని ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయాల్సి ఉంది. డివివి దానయ్య బ్యానర్ లో సుజిత్ నాని కాంబో మూవీ లాస్ట్ ఇయరే సెట్స్ మీదకు వెళ్లాల్సింది కానీ అది లేట్ అవుతూ వస్తుంది. ఓజీ సినిమా పూర్తయ్యాకే సుజిత్ ఫ్రీ అవుతాడు. ఐతే పవన్ ఓజీకి ఇంకాస్త టైం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఓజీ లేట్ అవుతుందని సుజిత్ నాని సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేశాడట.
నాని ఎనర్జీకి పర్ఫెక్ట్ గా ప్లస్ అయ్యే కథతో ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెలుస్తుంది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజిత్ ఓజీ తర్వాత మాత్రం నానితో వెంటనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీని మాక్సిమం ఏడాదిలో పూర్తి చేసి రిలీజ్ చేసేలా ఆలోచనలో ఉన్నారట. నాని కుదిరితే రెండు లేదా ఒక సినిమా అయినా ఏడాదికి రిలీజ్ చేస్తాడు. సో ఆ ప్లానింగ్ ప్రకారంగానే సినిమాల క్యూ ఉంటుంది.
నెక్స్ట్ ఇయర్ మార్చికి ప్యారడైజ్ రిలీజ్ అయితే సుజిత్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండే ఛాన్స్ లేదు. సో ఆ సినిమా 2027 లోనే వస్తుంది. ఐతే నాని ప్యారడైజ్ రిలీజ్ ముందే సుజిత్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తే మాత్రం ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి నాని తన సినిమాల ప్లానింగ్ ఎలా చేస్తున్నాడో చూడాలి. ప్రస్తుతం ఐతే తన పూర్తి ఫోకస్ అంతా కూడా ప్యారడైజ్ మీద పెట్టాడు.
