తక్కువ అంచనా వేయొద్దు.. నాని వన్ లైనర్స్ ఎవరికోసం..?
న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలనుతో హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా హిట్ ది థర్డ్ కేస్ సినిమాను నాని తన భుజాన వేసుకుని నడిపించాడు.
By: Tupaki Desk | 2 May 2025 9:30 AMన్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలనుతో హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా హిట్ ది థర్డ్ కేస్ సినిమాను నాని తన భుజాన వేసుకుని నడిపించాడు. సినిమా గురించి నాని ముందు చెబుతున్న మాట నిన్న సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం తెలిశాక అర్థమైంది. సైంధవ్ తో ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ ని హిట్ 3 తో హిట్ ట్రాక్ ఎక్కించిన క్రెడిట్ నానికి దక్కుతుంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరోగా నాని సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. హిట్ 3 సినిమాలో నాని నెక్స్ట్ లెవెల్ మాస్ విధ్వంస ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
ఎంచుకున్న కథ ప్రకారంగానే తన ఆహార్యం.. అభినయం చూపించడం ప్రతి హీరో చేసే పనే.. కానీ ఎంచుకున్న కథలోకి ఆడియన్స్ ని కనెక్ట్ చేయడం అన్నది నాని దగ్గరే నేర్చుకోవాలి. హిట్ 3 విషయంలో వైలెన్స్ ని కూడా వాలిడ్ అనిపించేలా చేశాడు. ఐతే ఈ సినిమాలో నాని చేసిన అర్జున్ సర్కార్ పాత్ర చెప్పిన వన్ లైనర్స్ సర్ ప్రైజ్ చేశాయి.
నన్ను తక్కువ అంచనా వేయొద్దు అని నాని తనకు తానుగా చెబుతున్న మాటలుగా ఇవి అర్ధమవుతున్నాయి. సినిమాలో ఒక సీన్ లో సూటేసుకున్న నానిని విలన్ క్లాస్ అంటాడు. దానికి నాని బదులుస్తూ అలా అనుకునే ఇన్నాళ్లు మోసపోయారు జనాలు అని అంటాడు. ఒక ఫైట్ లో లేడీ నానితో నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వలేవు అని అంటే.. కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నా ఈ మాట అని ఆమె గొంతులో కత్తి దించుతాడు.
ఇలా నాని చెప్పిన వన్ లైనర్స్ తన క్యారెక్టర్ కోసం రాసినవే అయినా కూడా తనని తక్కువ అంచనా వేస్తున్న ప్రతి ఒక్కరి కోసం అనిపించేలా ఉన్నాయి. నాని సినిమా అంటే చాలు పక్కా హిట్ అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. హిట్ 3 ని క్రైం థ్రిల్లర్ తరహాలో కాకుండా ఒక కమర్షియల్ సినిమాగా మార్చిన తీరు బాగుంది. హిట్ ఫ్రాంచైజీలు అన్నీ ఇలానే కొనసాగుతాయా అని చెప్పడం కష్టం కానీ.. హిట్ 3 మాత్రం నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.