నా కొడుక్కి సినిమా చూపించను
హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నాని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 30 April 2025 1:19 PMకెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ, వివిధ జానర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో చేసిన తాజా సినిమా హిట్3. నాని ఈ సినిమాలో తన కెరీర్లోనే మొదటిసారి పోలీస్ గా కనిపించనున్నాడు. హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నాని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఎంతో సంతోషంగా ఉందన్న నాని, హిట్3కు సెన్సారు బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చినా ఈ రేంజ్ బుకింగ్స్ ఉండటం చాలా ఆనందాన్నిస్తున్నాడు. హిట్3 సినిమాను డైరెక్టర్ శైలేష్ కొలను అన్ని కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దిన విధానం తనకెంతగానో నచ్చిందని నాని ఈ సందర్భంగా తెలిపాడు.
హిట్ ఫ్రాంచైజ్ లో వయొలెన్స్ అనేది జానర్ కాదని, హిట్3 లో అనుకోకుండా వయొలెన్స్ తీవ్రత పెరిగిందని, హిట్4 లో ఈ రేంజ్ వయొలెన్స్ ఉండకపోవచ్చని కూడా నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. హిట్3 సినిమాను అందరూ ఆనందించేలా రూపొందించామని చెప్పిన నాని, తన కొడుక్కి ఈ సినిమాను చూపించనని, మిగిలిన వాళ్లు కూడా తమ పిల్లలకు ఈ సినిమాను చూపించొద్దని నాని మరోసారి చెప్పాడు.
పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ తమ సినిమాను చూడకపోవడం వల్ల తమ సినిమాకు కలెక్షన్స్ తగ్గుతాయనే విషయం తనకు తెలుసని, కానీ తమ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ అందరికీ కచ్ఛితంగా నచ్చుతుందని ఎంతో నమ్మకంగా చెప్పాడు నాని. హిట్3 కోసం మిక్కీ జే మేయర్ చాలా డిఫరెంట్ సౌండ్ ను రూపొందించాడని, బీజీఎం కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉందని నాని తెలిపాడు.
సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ హిట్3 మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని చెప్పిన నాని, మూవీ చూశాక ప్రతీ ఒక్కరూ తను చేసిన అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ను ఇష్టపడతారని చెప్పాడు. హిట్3 మంచి ఎమోషనల్ రైడ్ అని, క్లైమాక్స్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటూ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుందని నాని చెప్పాడు.