Begin typing your search above and press return to search.

‘హిట్ 3’ టికెట్ సేల్స్‌లో సంచలనం: మరో రికార్డ్ బ్లాస్ట్

బుక్‌ మై షో డేటా ప్రకారం, ‘హిట్ 3’ సినిమా టికెట్ సేల్స్‌లో కొత్త రికార్డ్ ను అందుకుంది.

By:  Tupaki Desk   |   10 May 2025 10:24 AM
Nani HIT3 Tickets
X

నాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ అనేలా అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్, రెండో వారంలోకి అడుగుపెట్టినా ఏ మాత్రం వేగం తగ్గకుండా జోరును కొనసాగిస్తోంది. నాని ఇంటెన్స్ కాప్ రోల్‌లో అదరగొట్టడంతో సినిమా ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది.


బుక్‌ మై షో డేటా ప్రకారం, ‘హిట్ 3’ సినిమా టికెట్ సేల్స్‌లో కొత్త రికార్డ్ ను అందుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు 1.3 మిలియన్ టికెట్లను అమ్ముడుపోయి, నాని కెరీర్‌లో అత్యధిక టికెట్ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గత 24 గంటల్లోనే 28 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం సినిమా బలమైన ఊపును సూచిస్తోంది. ఈ నెంబర్ సినిమా స్టామినాను చాటుతోంది.

ఈ ఘనతతో ‘హిట్ 3’ సినిమా, నాని గత చిత్రం ‘సరిపోదా శనివారం’ రికార్డును అధిగమించింది. ‘సరిపోదా శనివారం’ బుక్‌మైషోలో 1.36 మిలియన్ టికెట్లను అమ్మగా, ‘హిట్ 3’ 1.3 మిలియన్ టికెట్లతో దాన్ని మించిపోయింది. ఈ విజయం నాని కెరీర్‌లో డిజిటల్ టికెట్ సేల్స్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సినిమా ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ను ఈ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి.

సినిమా రెండో వారంలో కూడా బలమైన వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సినిమా ఆదరణతో ఆదాయంలో మంచి పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. నాని అభిమానులు ఈ సినిమాకు బలమైన సపోర్ట్ అందిస్తున్నారు, ఇది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది.

‘హిట్ 3’ సినిమా ‘A’ రేటింగ్‌తో ఉన్నప్పటికీ యూత్, మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా కశ్మీర్ నేపథ్యంలో ఓ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేసేందుకు నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర ఆకట్టుకుంది. శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించగా, మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు బలం తెచ్చింది. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ బిగ్ రికార్డ్ గా నిలిచింది.