Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: యూఎస్ లో కూడా ‘హిట్ 3’ రికార్డ్.. రెండు రోజుల్లో ఎంతంటే?

నాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 5:14 AM
Nani Touches $1.5M Collection In Us Boxoffice
X

నాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవల రిలీజై, రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది. నాని అర్జున్ సర్కార్ ఐపీఎస్ రోల్‌లో కనిపించి అభిమానులను అలరించాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మంచి పాత్రతో ఆకట్టుకోగా, మిక్కీ జె మేయర్ సంగీతంతో మరింత బూస్ట్ ఇచ్చాడు. సినిమా ఒక డిఫరెంట్ యాక్షన్, సస్పెన్స్‌తో ఆకట్టుకుంటోంది.


వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా జోరు చూపిస్తోంది. రెండు రోజుల్లో ‘హిట్ 3’ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.62 కోట్లు దాటింది. ఈ సినిమా నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తుంది. బుక్‌మైషోలో ఓపెనింగ్ రోజే 272.95K టికెట్ల బుకింగ్‌తో సినిమా రికార్డు సృష్టించింది.

హాలీవుడ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్‌తో యూత్, ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇక ‘హిట్ 3’ నార్త్ అమెరికాలో $1.5 మిలియన్ (దాదాపు రూ.12.6 కోట్లు) వసూళ్లు రాబట్టింది. ఈ రేంజ్‌లో ఓవర్సీస్ కలెక్షన్స్ సాధించడం నాని కెరీర్‌లో ఓ కొత్త రికార్డు. అర్జున్ సర్కార్ రోల్‌లో నాని నటన అమెరికా ఆడియన్స్‌ను ఫుల్ ఆకర్షించింది. #AbkiBaarArjunSarkaar ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రత్యంగిరా యూఎస్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తోంది. సినిమా యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, సర్‌ప్రైజ్ క్యామియోలు ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతాయని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా సాలిడ్ ఆక్యుపెన్సీ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం నుంచి షోలు మొదలవడంతో ఫ్యాన్స్ జోష్ ఆకాశాన్ని తాకుతోంది. మొత్తంగా, ‘హిట్ 3’ నాని స్టార్‌డమ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. దసరా సినిమా కంటే ఈ సారి నాని హై రేంజ్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. టైర్ 2 స్టేజ్ లో ఉన్న నాని వరుస విజయాలతో టైర్ 1 కి దూసుకులేతున్నాడు అని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో సినిమా ఇంకా ఎలాంటి రికార్డ్స్ లను క్రియేట్ చేస్తుందో చూడాలి.