టైర్-2 హీరోల బిజినెస్.. టాప్ లిస్ట్ ఇదే!
టాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 9:30 AMటాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, రామ్, నితిన్ వంటి హీరోలు తమ సినిమాలతో మార్కెట్‌ను మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమాలు కంటెంట్ బలంతో పాటు, యూత్‌ను ఆకర్షించే కథలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ టైర్-2 హీరోల బిజినెస్ రేంజ్‌ను మరోసారి చాటింది.
‘హిట్ 3’ రూ.48.5 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో టైర్-2 హీరోల సినిమాల్లో టాప్-5లో నిలిచింది. మే 1 విడుదలకానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సినిమాపై హైప్ చూస్తే, వీకెండ్‌లో కలెక్షన్స్ ఊపందుకునే అవకాశం ఉంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ‘హిట్ 3’లో నాని ఇంటెన్స్ IPS ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు.
‘A’ రేటింగ్‌తో యూత్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమా, ట్రైలర్‌లోని యాక్షన్, సస్పెన్స్‌తో అంచనాలు పెంచింది. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా మొదటి వీకెండ్‌లో రూ.50 కోట్ల గ్రాస్‌ను అందుకుంటుందని అంచనా వేస్తున్నాయి. నాని ప్రమోషన్స్‌లో ఫుల్ ఎనర్జీతో రాష్ట్రాలు తిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో రికార్డ్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
టైర్-2 హీరోల సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రూ.88.4 కోట్లతో టాప్‌లో ఉంది, కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ‘కుషి’ (2023) రూ.52.5 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాని ‘దసరా’ రూ.50 కోట్ల బిజినెస్‌తో రూ.100 కోట్ల గ్రాస్ సాధించి సక్సెస్ అయింది. రామ్ నటించిన ‘స్కంద’ (రూ.46.2 కోట్ల) బిజినెస్‌లో మంచి రికార్డ్ సాధించినా, కలెక్షన్స్‌లో వెనుకబడింది. ఈ సినిమాలు టైర్-2 హీరోల మార్కెట్ పొటెన్షియల్‌ను చూపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ (రూ.34.6 కోట్ల), నాగ చైతన్య ‘థాండేల్’ (రూ.37 కోట్ల), నితిన్ ‘డబుల్ ఇస్మార్ట్’ (రూ.48 కోట్ల) వంటి సినిమాలు కూడా బిజినెస్‌లో మంచి మార్కులు కొట్టాయి. ‘సరిపోదా శనివారం’ (రూ.41 కోట్ల) నాని ఖాతాలో మరో సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాలు యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలతో మీడియం రేంజ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చాయి. అయితే, బిజినెస్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా రాణించాలంటే సరైన రిలీజ్ ప్లానింగ్ కీలకం.
టైర్-2 హీరోల టాప్ ప్రీ-రిలీజ్ బిజినెస్ సినిమాలు
లైగర్: 88.4 కోట్లు
ఖుషి (2023): 52.5 కోట్లు
దసరా: 50 కోట్లు
హిట్ 3: 48.5 కోట్లు
డబుల్ ఇస్మార్ట్: 48 కోట్లు
స్కంద: 46.2 కోట్లు
ఫ్యామిలీ స్టార్: 43 కోట్లు
అఖిల్: 42 కోట్లు
సరిపోదా శనివారం: 41 కోట్లు
ది వారియర్: 38.1 కోట్లు
తండేల్: 37 కోట్లు
ఏజెంట్: 36.2 కోట్లు
డియర్ కామ్రేడ్: 34.6 కోట్లు