నాని ‘హిట్ 3’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 4 May 2025 6:49 AMనేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండో రోజు కంటే మూడో రోజు (శనివారం) ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం. శనివారం ఒక్క రోజే రూ.20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తోంది.
ఈ ఊపుతో రూ.100 కోట్ల మార్క్ ను ఆదివారం అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘హిట్’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ మూడో చిత్రం, నాని కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా కనిపిస్తోంది. వర్డ్ ఆఫ్ మౌత్, అద్భుతమైన ఆక్యుపెన్సీతో ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తోంది. నార్త్ అమెరికాలో కూడా ‘హిట్ 3’ జోరు చూపిస్తోంది. ఇప్పటికే $1.8 మిలియన్లు వసూలు చేసిన ఈ చిత్రం, $2 మిలియన్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా దూసుకెళ్తోంది.
‘దసరా’, ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని సాధించిన మూడో $2 మిలియన్ చిత్రంగా ఇది నిలవనుంది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగుండటంతో మరో రోజు ఈ జోరు కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో, నాని నటనతో పాటు గ్రిప్పింగ్ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాని తనదైన స్టైల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో మెరిసి, అభిమానులను అలరిస్తున్నాడు.
ఈ సినిమా కేవలం వసూళ్లతోనే కాకుండా, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. నాని మరోసారి తన స్టార్‌డమ్‌తో పాటు నటనా ప్రతిభను చాటుకున్నాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి అంచనాలను రేకెత్తించిన ‘హిట్ 3’, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆ అంచనాలను నిజం చేస్తోంది.
‘వాల్ పోస్టర్ సినిమా’, ‘ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌లపై రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకుంటోంది. నాని కెరీర్‌లో ‘హిట్ 3’ మరో బిగ్ రికార్డ్ గా నిలిచేలా కనిపిస్తోంది. నాని ఎంచుకునే కథలు, అతని నటనా శైలి ఇండస్ట్రీలో ఎంత ప్రభావం చూపిస్తాయో మరోసారి రుజువు చేసింది. రూ.100 కోట్ల మార్క్‌ను దాటడంతో పాటు, నార్త్ అమెరికాలో $2 మిలియన్ల క్లబ్ లో చేరడం ద్వారా ‘హిట్ 3’ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది.