Begin typing your search above and press return to search.

అర్జున్ స‌ర్కార్ బాక్సాఫీస్‌ టార్గెట్ ఎంత?

ఇదిలా ఉంటే `హిట్ 3` ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 April 2025 7:55 AM
HIT 3 Box Office Target
X

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న హైఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `హిట్ : ది థ‌ర్డ్ కేస్‌`. శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్‌లో హీరో నాని నిర్మిస్తూ న‌టిస్తున్న ఈ మూవీ మ‌రో రెండు వారాల్లో అంటే మే 1న భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీ‌నిధిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌న‌కు ఈ ప్రాజెక్ట్ అత్యంత కీల‌కం. ఇదిలా ఉంటే `హిట్‌` ఫ్రాంజైజీలో భాగంగా వ‌స్తున్న థ‌ర్డ్ ఫిల్మ్ ఇది. తొలి రెండు భాగాల్లో విశ్వ‌క్‌సేన్‌, అడివి శేష్ న‌టించారు. ఆ రెండూ హిట్ అనిపించుకున్నాయి.

ఇప్పుడు నాని హీరో వ‌స్తున్న థ‌ర్డ్ పార్ట్ `హిట్ 3`. హిట్ 2లోనే పార్ట్ 3లో నాని న‌టిస్తున్నాడ‌ని, అర్జున్ స‌ర్కార్‌గా రూత్‌లెస్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని హింట్ ఇవ్వ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని తారా స్థాయికి చేర్చింది. రెండు పార్ట్‌ల‌కు మించి `హిట్ 3` ఉంటుంద‌ని, ఆ రెండు సినిమాల‌కిది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంద‌ని తేలిపోయింది. దీంతో అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి.

సినిమా ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మాట్లాడిన నాని ఆ అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేశారు. ఇదిలా ఉంటే `హిట్ 3` ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. ఆంధ్రా 6 రీజియ‌న్‌ల‌లో రూ.15 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేసిందట‌. సీడెడ్ రూ.5 కోట్లు, నైజాం రూ.11 టు 12 కోట్లు చేయ‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట్రిక‌ల్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.

ఈ నేప‌థ్యంలో హిట్ 3 థియేట్రిక‌ల్ షేర్ రూ.40 కోట్ల‌కు పైనే రాబ‌ట్టాల్సి వుంటుంద‌ని అంటే రూ.75 కోట్ల మేర గ్రాస్‌ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా సాధిస్తేనే ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఓటీటీ హ‌క్కుల రూపంలోనూ నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా భారీ మొత్తం డీల్ కుదిరింద‌ని, నాని `హిట్ 3`కిది బిగ్ బూస్ట్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.