Begin typing your search above and press return to search.

హిట్ 3 బాక్సాఫీస్.. నాని నిరూపించాడుగా..

కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాలు.. థియేటర్స్ లో రిలీజ్ అయితే సినీ ప్రియులు కచ్చితంగా వెళ్తారు.

By:  Tupaki Desk   |   5 May 2025 2:21 PM IST
HIT 3 Roars at the Box Office Nani Proves Theatrical Power
X

థియేటర్స్ కు ఆడియన్స్ రావడం లేదు.. సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. ఇవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలు.. కానీ ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లడం లేదన్న మాట నిజం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పలు సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. జనాలు వెళ్లకపోతే అది పాజిబుల్ కాదు కదా..

కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాలు.. థియేటర్స్ లో రిలీజ్ అయితే సినీ ప్రియులు కచ్చితంగా వెళ్తారు. కానీ థియేటర్స్ కు జనాలు రావట్లేదని అందరి మదిలో ఉండిపోయింది. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ హిట్ 3: థర్డ్ కేస్ తో మెప్పిస్తున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అర్జున్ సర్కార్ రోల్ లో దుమ్ముదులిపేశారు. క్లాస్ గా కనిపిస్తూనే వైలెంట్ యాక్షన్ తో అలరించారు. అలా ఇప్పుడు వరుసగా నాలుగో హిట్ ను సొంతం చేసుకున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో విజయాలు అందుకోగా.. ఇప్పుడు హిట్ ట్రాక్ కంటిన్యూ చేశారు.

అదే సమయంలో హిట్ 3 మూవీ అటు బుకింగ్స్ పరంగా, కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే కొన్ని ఏరియాలు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చాయి. మరికొన్ని ఏరియాల్లో ఆల్రెడీ బ్రేక్ ఇవెన్ అయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో లో 70% పైగా రికవరీ సాధించిన హిట్ మూవీ.. ఇప్పుడు దూసుకుపోతోంది.

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా హిట్ 3 మూవీ రూ.100 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే మైల్ స్టోన్ అందుకుని సినిమా సత్తా చాటిందని చెప్పాలి. ఫుల్ రన్ లో భారీ ఫిగర్స్ ను నమోదు చేసేలా ఉందని అర్థమవుతోంది. రూ.200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని చెబుతున్నారు.

ఫుల్ రన్ లో హిట్ -3 ఫుల్ రేంజ్ ప్రాఫిట్ మూవీగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సమ్మర్ లో టాలీవుడ్ లో ఎట్టకేలకు హిట్ పడిందని చెప్పాలి. దీంతో నాని ఫ్యాన్స్ తెగ రెస్పాండ్ అవుతున్నారు. నాని రేంజ్ అంటే అది అని చెబుతున్నారు. మరోసారి మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్నారని కొనియాడుతున్నారు.