'హిట్ 3' హిస్టరీ: నాని మాస్ రచ్చతో బాక్సాఫీస్ షేక్!
రూ.101 కోట్లతో బాక్సాఫీస్ రణం కొనసాగిస్తూ, నార్త్ అమెరికాలో $2 మిలియన్ మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది.
By: Tupaki Desk | 5 May 2025 12:05 PMనాచురల్ స్టార్ నాని 'హిట్ 3: ది థర్డ్ కేస్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్, 'హిట్' ఫ్రాంచైజ్‌లో మూడో సినిమాగా మే 1న రిలీజైన విషయం తెలిసిందే. నాని మరోసారి మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలనని నిరూపించాడు. నాలుగు రోజుల్లో సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.101 కోట్లు దాటింది. ప్రశాంతి తిర్పినేని నిర్మించిన ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ నిలిచింది.
సినిమా రిలీజైన తొలి రోజు నుంచే హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్లింది. నాని స్టార్‌డమ్, కమర్షియల్ ఫార్మాట్‌లో మంచి కంటెంట్ అందించే అతని కమిట్‌మెంట్ మరోసారి సక్సెస్ అయింది. 'A' రేటింగ్‌తో ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రౌడ్‌ను ఆకర్షించడం నాని స్టార్ పవర్‌ను చాటుతోంది. థియేటర్లు కష్టాల్లో ఉన్న సమయంలో 'హిట్ 3' ఓ వరంగా మారిందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ముఖ్యంగా ఓవర్సీస్‌లో 'హిట్ 3' సంచలనం మరింత జోరుగా ఉంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే $2 మిలియన్ (రూ.16.8 కోట్లు) మార్క్‌ను దాటింది. ఇది నాని కెరీర్‌లో మూడో $2 మిలియన్ గ్రాసర్‌గా నిలిచింది. నైజాం, ఉత్తరాంధ్ర, ఓవర్సీస్ మార్కెట్స్‌లో సినిమా ఇప్పటికే లాభాల జోన్‌లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నాని సినిమాల్లో ఇది కొత్త రికార్డు సెట్ చేసింది. సినిమా హాలీవుడ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ సీన్స్ ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి.
ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమా డబుల్ లాభాలు తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండో వారంలో పెద్ద సినిమాలు లేకపోవడం, సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ సినిమాకు కలిసొస్తుందని అంటున్నారు. నాని రూత్లెస్ కాప్ రోల్‌లో చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు నానిని 'థియేటర్ల సేవియర్'గా పొగుడుతున్నారు.
ఈ సినిమా నాని కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా, 'హిట్ 3' నాని స్టార్‌డమ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రూ.101 కోట్లతో బాక్సాఫీస్ రణం కొనసాగిస్తూ, నార్త్ అమెరికాలో $2 మిలియన్ మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తర్వాత నాని ఎలాంటి సినిమాలతో ఆకర్షిస్తాడో చూడాలి.