మళ్లీ దాని జోలికి వెళ్లే ప్రసక్తేలేదు: నాని
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలతో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది.
By: Tupaki Desk | 25 April 2025 4:00 AM ISTనేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `హిట్ ది థర్డ్ కేస్`. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా మే 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డులు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ద్వారా `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలతో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో హీరో నాని ప్రమోషన్స్ పరంగా స్పీడుపెంచారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన నాని బిగ్‌బాస్ సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బిగ్‌బాస్ సీజన్ గురించి నాని మాట్లాడుతూ షాకింగ్‌గా స్పందించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగు బిగ్‌బాస్ తొలి సీజన్ మొదలైన విషయం తెలిసిందే. విజయవంతంగా ఫస్ట్ సీజన్‌ని పూర్తి చేసిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్‌ని చేయలేనంటూ చేతులెత్తేశారు. దీంతో ఆ స్థానంలోకి హీరో నాని రావడం, సెకండ్ సీజన్‌ని పట్టాలెక్కించడం తెలిసిందే. తనదైన మార్కుని చూపించాలని ఛాయ్ గ్లాస్‌తో నాని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అంతే స్థాయిలో ట్రోల్‌కు గురికావడం తెలిసిందే. ఈ సీజన్ సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న నాని ఆ తరువాత ఇక తన వల్ల కాదని నిర్ణయించుకుని సీజన్ 3కి తప్పుకున్నాడు.
ఇదే తన చివరి సీజన్ అని, మరోసారి హోస్ట్‌గా చేయనని ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నా లైఫ్‌లో బిగ్‌బాస్ చాప్టర్ ముగిసింది. మళ్లీ దానిజోలికి వెళ్లను. రెండో సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్‌బాస్ హోస్ట్‌గా నా జీవితంలో ఇదే చివరి రోజు అని పోస్ట్ పెట్టాను. అయితే బిగ్ బాస్ వల్లే బయటి ప్రపంచం అంటే ఏంటో నాకు బాగా తెలిసొచ్చింది. నన్ను మరింత టఫ్‌గా మార్చింది` అని బిగ్‌బాస్ షోపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు నాని.
