Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాని కొట్ట‌డ‌మే నాని ధ్యేయం

డిస్టోస్పియ‌ర్ యూనివ‌ర్శ్ స్టోరీలో రాఘ‌వ్ జులాల్ ప్ర‌తినాయ‌క పాత్ర మూవీని మ‌రో స్థాయికి తీసుకెళుతుంద‌ని నాని న‌మ్ముతున్నాడు.

By:  Tupaki Desk   |   1 May 2025 9:37 PM IST
పాన్ ఇండియాని కొట్ట‌డ‌మే నాని ధ్యేయం
X

బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌తో దూసుకెళుతున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. అత‌డు న‌టించిన హిట్ 3 థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ ప్ర‌శంస‌ల‌తో పాటు, తొలి వీకెండ్ వ‌సూళ్ల‌లోను హిట్ 3 హ‌వాకు ఎదురే లేద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ జాన‌ర్ లో ఒక పాన్ ఇండియ‌న్ స్టార్ కి కావాల్సిన ల‌క్ష‌ణాలు త‌న‌కు ఉన్నాయ‌ని నాని త‌న న‌ట‌న‌తో మ‌రోసారి నిరూపించాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు అభిమానులు.

ఇక నాని మైండ్ లో ఏం ఉందో అది త‌న‌ సినిమాల ద్వారా బ‌య‌ట‌ప‌డుతోంది. అత‌డు ఎంపిక చేసుకున్న త‌దుప‌రి చిత్రం 'ప్యార‌డైజ్' పూర్తిగా పాన్ ఇండియా రేంజు ప్ర‌య‌త్నం. డిస్టోస్పియ‌ర్ యూనివ‌ర్శ్ క‌థ‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నాడు. ఈ జాన‌ర్లో అన్ లిమిటెడ్ యాక్ష‌న్ కి ఆస్కారం ఉండ‌టంతో అత‌డి ఎలివేష‌న్ మ‌రో లెవ‌ల్లో ఉండ‌నుంది. ఇక‌ త‌న సినిమాకి క‌థ‌లు, పాత్ర‌ల ఎంపిక‌తోనే పాన్ ఇండియా అప్పీల్ తెచ్చేందుకు నాని స‌ర్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అత‌డు న‌టించిన ప్యార‌డైజ్ టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఆస‌క్తిక‌రంగా బాలీవుడ్ హిట్ చిత్రం 'కిల్' హీరో రాఘ‌వ్ జులాల్‌ని ఈ మూవీ కోసం విల‌న్ గా ఎంపిక చేసుకున్నాడు.

డిస్టోస్పియ‌ర్ యూనివ‌ర్శ్ స్టోరీలో రాఘ‌వ్ జులాల్ ప్ర‌తినాయ‌క పాత్ర మూవీని మ‌రో స్థాయికి తీసుకెళుతుంద‌ని నాని న‌మ్ముతున్నాడు. హీరో ల‌క్ష్య‌తో పోటీప‌డి న‌టుడిగా రాఘ‌వ్ తొలి చిత్రంతోనే త‌న‌దైన ముద్ర వేసాడు. అందుకే ఇప్పుడు నాని సినిమాలో న‌టిస్తున్నాడు అన‌గానే ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పాటు, అటు బాలీవుడ్ మార్కెట్లోను ఆస‌క్తి పెరిగింది. మొత్తానికి పాన్ ఇండియా అప్పీల్ కోసం నాని స‌ర్వ ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. నాని ఇప్ప‌టికే 100 కోట్ల క్ల‌బ్ హీరో. స‌రిపోదా శ‌నివారం చిత్రంతో ఈ ఫీట్ ని సాధించాడు. దీనిని మ‌రో స్థాయికి తీసుకెళ్లేందుకు అత‌డు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. పాన్ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ లో హీరోల మ‌ధ్య పోటాపోటీ అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచేస్తోంది.