హిట్ 3 ఎక్కితే మాత్రం ఆ టార్గెట్ రీచ్ అయినట్టే..!
నాని ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఆ పాజిటివ్ బజ్ ఉంటుంది. ఐతే హిట్ 3 నాని సినిమాల్లో చాలా ప్రత్యేకమైన సినిమాగా వస్తుంది.
By: Tupaki Desk | 17 April 2025 7:30 PMన్యాచురల్ స్టార్ నాని హిట్ 3 మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫ్రాంచైజీ సినిమాలు తెరకెక్కాయి. హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ హీరోగా చేయగా అది సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత హిట్ 2 అడివి శేష్ లీడ్ రోల్ లో చేయగా అది సూపర్ హిట్ కొట్టింది. హిట్ 3 కి కాస్త టైం తీసుకున్న శైలేష్ హిట్ థర్డ్ కేస్ తో ఈసారి నానిని అర్జున్ సర్కార్ గా చూపిస్తున్నాడు. హిట్ 3 ప్రచార చిత్రాలు నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తున్నాయి.
ముఖ్యంగా నాని లోని ఊర మాస్ విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. సినిమా కథ ఎంపిక చేసుకోవడం నుంచి రిలీజ్ వరకు నాని కేవలం హీరోగానే కాదు అన్ని విధాలుగా తన బెస్ట్ ఇస్తూ వస్తాడు. ఐతే హిట్ 3 సినిమా విషయంలో నాని నిర్మాతగా కూడా మరింత ఫోకస్ తో పనిచేశాడు. హిట్ 3 సినిమాకు ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది.
నాని ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఆ పాజిటివ్ బజ్ ఉంటుంది. ఐతే హిట్ 3 నాని సినిమాల్లో చాలా ప్రత్యేకమైన సినిమాగా వస్తుంది. ఎందుకంటే నాని సినిమాల్లో ఈ రేంజ్ వైలెన్స్ ఇదివరకు ఏ సినిమాలో చూడలేదు. ఐతే హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 నాని ఊచకోత చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి ఆడియన్స్ ని ట్యూన్ చేస్తూ వచ్చిన నాని టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచాడు.
ఇక నెక్స్ట్ సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఐతే నాని హిట్ 3 పై ఉన్న ఈ పాజిటివ్ బజ్ చూస్తుంటే కచ్చితంగా ఒక రేంజ్ లో హిట్ అందుకునేలా ఉంది. అంతేకాదు తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి రిలీజ్ లు దొరుకుతున్నాయి. అందుకే సరైన విధంగా క్లిక్ అయితే మాత్రం నాని హిట్ 3 పక్కా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందని అంటున్నారు. ఇక కమర్షియల్ లెక్కల్లో చెప్పాలంటే హిట్ 3 సూపర్ హిట్ అనిపించుకుంటే మాత్రం 200 కోట్లు టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది. మరి నాని హిట్ 3 ఏమేరకు వసూళ్ల బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.