Begin typing your search above and press return to search.

హిట్ 3 కలెక్షన్స్ పెంచే దిశగా నాని యాత్రలు!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ "హిట్ 3" ఇప్పుడు ఫుల్ బజ్‌తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   21 April 2025 11:37 AM IST
Nani Gears Up for HIT 3 with Intense Promotions In Usa
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ "హిట్ 3" ఇప్పుడు ఫుల్ బజ్‌తో దూసుకుపోతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం "హిట్ యూనివర్స్" లో మూడవ పార్ట్‌గా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. నాని పాత్ర వేరే లెవెల్ లో ఉండబోతుందన్న టాక్ స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన కనిపించే యాంగ్రీ లుక్‌, యాక్షన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రేక్షకుల్లో ఇంటెన్స్ థ్రిల్లింగ్ అంచనాలను రేపాయి.

ఇటీవల హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ పబ్లిసిటీ సెట్, అక్కడ జరిపిన ప్రమోషన్ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. వయొలెన్స్ థీమ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా కోసం అదే స్థాయిలో వయొలెంట్ ప్రమోషన్స్ కూడా హైలెట్ చేస్తున్నారు. ఈ నెల 27న తిరుపతిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆ రోజు నానికి ఎదురెళ్లే రెస్పాన్స్ చూడాల్సిందే.

అయితే మేకర్స్ దీన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్లు జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా కూడా హిట్ 3 సినిమా పట్టు సంపాదించాలనే ఉద్దేశంతో నాని ఒక స్పెషల్ స్టెప్ వేశాడు. సినిమాకు రిలీజ్ ముందు నుంచే ప్రమోషన్ ప్రారంభించిన నాని, ఈసారి అమెరికా టూర్ కు బయలుదేరుతున్నాడు.

"హిట్ 3" విడుదలైన తర్వాత నాని USAలోని పలు ప్రధాన నగరాల్లో అభిమానులను కలవబోతున్నారు. ప్రీమియర్ షోలు, ఫ్యాన్ మీట్ ఈవెంట్లు, మీడియా ఇంటరాక్షన్లు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అమెరికాలో నానికి మంచి క్రేజ్ ఉంది. హాయ్ నన్నా, శ్యామ్ సింగ రాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి సినిమాలు అక్కడ సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు 'హిట్ 3'కి అక్కడి ప్రేక్షకుల నుంచి బిగ్ రిస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మే 1న విడుదల కాబోతోంది. నాని ఈసారి దేశవిదేశాల్లో అందర్నీ పలకరిస్తూ కలెక్షన్లను మరింతగా పెంచే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ అంచనాలన్నింటినీ సినిమాతో నెరవేర్చగలడా? ఈ ప్రమోషన్లు ఎంత వరకూ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తాయో త్వరలో తెలుస్తుంది.