Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి హిట్ 3.. ఆడియన్స్ అలా అంటున్నారేంటి?

సుమారు 29 రోజుల్లో.. అంటే నెల కాకుండా ఓటీటీలోకి హిట్-3 స్ట్రీమింగ్ కు రాగా.. ఇప్పుడు మంచి వ్యూస్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   31 May 2025 2:00 AM IST
ఓటీటీలోకి హిట్ 3.. ఆడియన్స్ అలా అంటున్నారేంటి?
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్ ది థర్డ్ కేస్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందిన ఆ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. అడివి శేష్, విశ్వక్ సేన్, తమిళ స్టార్ హీరో కార్తీ.. స్పెషల్ క్యామియో రోల్స్ లో అలరించారు.

అయితే అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత వరుస అప్డేట్స్ తో మేకర్స్ అంచనాలు పెంచారు. దీంతో సినిమా కోసం ఆడియన్స్, మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేశారు. అలా మే 1వ తేదీన విడుదలైన మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

సుమారు రూ.70 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ.. రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఐఎమ్‌ డీబీ నుంచి 10కి 7.4 రేటింగ్ సంపాదించుకుంది. అలా నాని కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. అర్జున్ సర్కార్ గా నాని అదరగొట్టారని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కమ్ సర్వైవల్ థ్రిల్లర్‌ అని అన్నారు.

ఇప్పుడు హిట్-3 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో వచ్చింది. 4కే డాల్బీ విజన్ వీడియో, డాల్బీ అట్మాస్ ఆడియో వెర్షన్‌ లో నెట్‌ఫ్లిక్స్‌ లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అది ఓటీటీ ఆడియెన్స్‌ కు మంచి ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందనే చెప్పాలి.

సుమారు 29 రోజుల్లో.. అంటే నెల కాకుండా ఓటీటీలోకి హిట్-3 స్ట్రీమింగ్ కు రాగా.. ఇప్పుడు మంచి వ్యూస్ వస్తున్నాయి. ప్రశంసలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండాఫ్ లో వైలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. అది సినిమాకు అనవసరమని చెబుతున్నారు.

నిజానికి.. హిట్-3 మూవీ సెకండ్ పార్ట్ లో యాక్షన్, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. నాని.. నెవ్వర్ బిఫోర్ రోల్ లో కనిపిస్తారు. ఇప్పటివరకు నాని.. అంతటి వైలెన్స్ ఉన్న సీన్స్ లో కనిపించలేదు. కానీ ఇప్పుడు కొందరు దాన్ని ఇష్టపడుతుండగా.. మరికొందరు దాన్ని అతిగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.