Begin typing your search above and press return to search.

హిట్ 3 నాని డబుల్ రెమ్యూనరేషన్..?

న్యాచురల్ స్టార్ నాని నటించి నిర్మించిన హిట్ 3 సినిమాకు అసలు నాని రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ లేదు. తను నిర్మాత హీరో కాబట్టి హీరోకి ఇవ్వాల్సిన పేమెంట్ మిగిలినట్టే.

By:  Tupaki Desk   |   30 April 2025 3:30 PM
Nani Remuneration For HIT3
X

న్యాచురల్ స్టార్ నాని నటించి నిర్మించిన హిట్ 3 సినిమాకు అసలు నాని రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ లేదు. తను నిర్మాత హీరో కాబట్టి హీరోకి ఇవ్వాల్సిన పేమెంట్ మిగిలినట్టే. కానీ నాని బయట ఒక సినిమా చేస్తే తన రెమ్యునరేషన్ ఉంటుందిగా అది హిట్ 3 కి తీసుకోలేదా అంటే నిర్మాత, హీరో తనే అయ్యే సరికి ఈ రెమ్యునరేషన్ మ్యాటర్స్ కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని హిట్ 3 కి తన రెగ్యులర్ సినిమాల రెమ్యునరేషన్ కన్నా డబుల్ అందుకున్నాడని తెలుస్తుంది.

అదేంటి సొంత నిర్మాణంలో సినిమాకు నాని ఎలా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటాడు అంటే.. తన ప్రొడక్షన్ లో సినిమా కాబట్టి అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేసేలా జాగ్రత్త పడ్డాడు నాని. ఇక సినిమా బిజినెస్ విషయంలో నాని స్టామినాకు తగినట్టుగానే జరిగిందట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా సినిమాకు పెట్టిన మొత్తం దాదాపు వచ్చేశాయట.

ఇక థియేట్రికల్ బిజినెస్ నానికి లాభాలు తెచ్చి పెట్టిందని టాక్. ఈ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే నాని తన రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ప్రస్తుతం నాని ఉన్న సూపర్ ఫాం కి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని తెలుస్తుంది. సో అలా నాని బయట సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కన్నా డబుల్ పేమెంట్ హిట్ కి అందుకున్నాడు. సో తను నిర్మాత కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా తన ఖాతలోనే పడుతుంది.

ఏది ఏమైనా సక్సెస్ ఫుల్ హీరోగా నాని ఓ పక్క మంచి గ్రాఫ్ మెయింటైన్ చేస్తూ వస్తూ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. రీసెంట్ గా కోర్ట్ సినిమా తీసి హిట్ కొట్టిన నాని హిట్ 3 తో మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. హిట్ 3 విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. క్రైం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి హిట్ 3 తప్పకుండా నచ్చుతుందని నాని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. హిట్ 3 తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా కాంబోలో వస్తున్న ఈ సినిమా నాని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.