హిట్ 3కి సెన్సార్ బ్రేక్.. నాని ప్లాన్ ఏంటీ?
అయితే ఈ స్క్రీనింగ్ తర్వాత సెన్సార్ సభ్యుల నుంచి ఎటువంటి అభిప్రాయం బయటికి రాలేదు. ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది.
By: Tupaki Desk | 12 April 2025 5:32 PMనేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 (HIT: The Third Case) మే 1న థియేటర్లకు రానుంది. ఈసారి నాని అర్జున్ సర్కార్ అనే భయంకరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే, సినిమా విడుదలకు ముందే ఒక కొత్త టెన్షన్ మేకర్స్‌ను ఆవరించడంతో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా సినిమా విడుదలకు వారం ముందే సెన్సార్ స్క్రీనింగ్ చేస్తుంటారు. కానీ హిట్ 3 సినిమాను ముగింపు నుంచి మూడో వారం ముందే సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ స్క్రీనింగ్‌కు నాని కూడా హాజరయ్యారు. ఇది చూసి పరిశ్రమలో చాలామందికి ఆశ్చర్యం కలిగిందట. దీనికర్థం, దర్శక నిర్మాతలు ముందే అన్ని అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నారనమాట.
అయితే ఈ స్క్రీనింగ్ తర్వాత సెన్సార్ సభ్యుల నుంచి ఎటువంటి అభిప్రాయం బయటికి రాలేదు. ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. హిట్ 3 సినిమా తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలతో నిండి ఉంటుందని టాక్. అందుకే కట్స్ మీద పెద్ద చర్చ సాగే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది.
ఒకవేళ భారీగా కట్స్ సూచిస్తే, నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాకు చెందిన టీమ్ రివిజన్ కమిటీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందట. ఇది తక్కువ కట్స్‌తో సినిమాను విడుదల చేసుకునేందుకు ఒక యత్నంగా చెప్పొచ్చు. అదే సమయంలో, అవసరమైతే సినిమాను తిరిగి ఎడిట్ చేయడానికి సైతం ముందుగానే సిద్ధమవుతున్నారు.
శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, HIT యూనివర్స్‌లో మూడో భాగం. మొదటి రెండు భాగాలు మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఈసారి కథలో మాస్ యాంగిల్, పోలీస్ రఫ్ క్యారెక్టర్‌తో టర్నింగ్ ఇవ్వాలని దర్శకుడు ట్రై చేశాడట. హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, టెక్నికల్ టీమ్ నుండి కూడా హై స్టాండర్డ్ ఔట్పుట్ వచ్చేలా ప్లాన్ చేశారు.
ఇప్పుడు సెన్సార్ సమస్యే కాకుండా, ఈ సినిమా టోన్‌ను పూర్తిగా ప్రభావితం చేసే అంశమవుతుంది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో ఉన్న రఫ్ మూడ్ కోసమే సినిమా అంతా హై ఇంటెన్సిటీ సన్నివేశాలతో నిండి ఉందన్న మాట వినిపిస్తోంది. మరి నాని ఈ సెన్సార్ టెన్షన్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు ఆ కట్స్ వాస్తవంగా ఎంతవరకు ఉంటాయో చూడాలి.