Begin typing your search above and press return to search.

'హిట్ 3' యూఎస్ బాక్సాఫీస్.. మహేష్ బాబు తరువాత నాని రికార్డుల ఊచకోత

ఈ పేస్‌తో వెళ్తే, $2-2.5 మిలియన్ (రూ.16.8-21 కోట్లు) సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2025 1:00 PM IST
హిట్ 3 యూఎస్ బాక్సాఫీస్.. మహేష్ బాబు తరువాత నాని రికార్డుల ఊచకోత
X

నాచురల్ స్టార్ నాని 'హిట్ 3: ది థర్డ్ కేస్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొనసాగిస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో రచ్చ చేస్తోంది. ఈ రోజుల్లో సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టంగా మారిన సమయంలో, నాని తన బ్రూటల్ కాప్ రోల్‌తో జనాలను ఆకర్షిస్తున్నాడు. 'హిట్' ఫ్రాంచైజ్‌లో మూడో సినిమాగా రిలీజైన ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో రికార్డ్ గా నిలిచింది.

సినిమా మే 1న రిలీజై, తొలి రోజు నుంచే రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా వర్కింగ్ డే అయినా, భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.62 కోట్లు దాటింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, మిక్కీ జె మేయర్ సంగీతంతో రూపొందిన ఈ సినిమా 'A' రేటింగ్‌తో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రౌడ్‌ను ఆకర్షిస్తోంది.

ఈ సినిమాను ప్రశాంతి తిర్పినేని భారీ స్థాయిలో నిర్మించారు. ఓవర్సీస్‌లో 'హిట్ 3' రచ్చ మరింత జోరుగా ఉంది. నార్త్ అమెరికాలో సినిమా $1.5 మిలియన్ (రూ.12.6 కోట్లు) మార్క్‌ను దాటింది. ఈ పేస్‌తో వెళ్తే, $2-2.5 మిలియన్ (రూ.16.8-21 కోట్లు) సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నాని నటన, సినిమా ఇంటెన్స్ యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో బాక్సాఫీస్ రికార్డ్స్ తో నాని పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నాని కెరీర్‌లో ఇది ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల గ్రాసర్‌గా నిలవనుంది. అంతేకాదు, ఈ సినిమా అతని కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నాని నార్త్ అమెరికాలో 11వ సినిమాగా $1 మిలియన్ మార్క్‌ను దాటాడు.

ఈ ఫీట్‌లో టాలీవుడ్‌లో మహేష్ బాబు తర్వాత నాని రెండో స్థానంలో నిలిచాడు. అలాగే, వరుసగా 4 సినిమాలతో $1.5 మిలియన్ గ్రాస్ సాధించిన 5వ టాలీవుడ్ స్టార్‌గా (మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తర్వాత) నిలిచాడు. మొత్తంగా, 'హిట్ 3' నాని స్టార్‌డమ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. నాని రూత్లెస్ కాప్ రోల్‌లో చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.