నేచురల్ స్టార్ డబుల్ హ్యాట్రిక్!
మాస్ హిట్ `దసరా` నుంచి నాని సక్సస్ కి తిరుగులేదు. `దసరా` నానికి భారీ మాస్ హిట్ గా నిలిచింది.
By: Tupaki Desk | 1 July 2025 6:00 AM ISTమాస్ హిట్ `దసరా` నుంచి నాని సక్సస్ కి తిరుగులేదు. `దసరా` నానికి భారీ మాస్ హిట్ గా నిలిచింది. అప్పటివరకూ క్లాస్ హీరోగా కనిపించిన నాని `దసరా`తో మాస్ లో ఫాలోయింగ్ మొదలైంది. మాస్ పాత్రలకు పర్పెక్ట్ గా సూటవుతాడని దసరా ప్రూవ్ చేసింది. అప్పటికే క్లాస్ ఇమేజ్ ఉన్న నానిపై మాస్ కి కనెక్ట్ అవుతాడా? లేదా? అన్న సదేహం ఉండేది కానీ ఆ హిట్ తో అన్ని పటాపంచల్ అయ్యాయి.
అటుపై `హాయ్ నాన్న` తో తనమార్క్ క్లాసిక్ హిట్ అందుకున్నాడు. అనంతరం `సరిపోదా శనివారం` అంటూ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ని అలరించాడు. ఇలా నాని కెరీర్ లో మూడు విజయాలు నమోద య్యాయి. ఆ హ్యాట్రిక్ విజయాన్ని కంటున్యూ చేస్తూ `హిట్ -3` తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సైకో లను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి మాస్ కోణంలో పీక్స్ చూపించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
దీంతో నాని కెరీర్ లో వరుసగా నాలుగు విజయాలు నమోదయ్యాయి. నానికి ఇలాంటి సక్సస్ లు కొత్తేం కాదు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి వరుస విజయాలు సాధించాడు. కానీ డబుల్ హ్యాట్రిక్ మాత్రం మిస్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడా ఛాన్స్ ఉంది. మరో రెండు సినిమాలు హిట్ కొడితే డబుల్ హ్యాట్రిక్ నమోదైనట్లే. అందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం `దసరా` దర్శకుడితో నే `ప్యారడైజ్` సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అసలే సక్సస్ పుల్ కాంబినేషన్ కావడంతో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అన్న అంచనాలున్నాయి. ఈ సినిమా అనంతరం నాని లైనప్ లో స్టార్ డైరెక్టర్లే ఉన్నా రు. ఇప్పటికే శేఖర్ కమ్ములా పేరు వినిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్, రాజమౌళి కూడా సినిమా చేసే అవకాశా లున్నాయి. వాళ్లే బరిలోకి దిగితే నాని ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ లాంఛనమే.
