నేచురల్ స్టార్ అలాంటి ప్రయత్నం చేసేదెప్పుడు?
కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఇంకా అలాంటి అటెంప్ట్ చేయలేదు.
By: Tupaki Desk | 12 May 2025 8:00 PM ISTస్వీయా దర్శకత్వంలో సినిమా చేయడం అన్నది అతికొద్ది మందే చేయగలరు. కెరీర్ ఆరంభంలో అడవి శేషు 'కర్మ' సినిమా చేసాడు. అటుపై 'కిస్' చిత్రం కూడా అలా రూపొందించినదే. ఆ రెండు చిత్రాలు మిన హాయిస్తే ఆయన హీరోగా నటించిన చాలా సినిమలకు రైటింగ్ విభాగంలోనూ పనిచేసారు. వాటిని వేర్వేరు దర్శకులు తెరకెక్కించారు. ఆ తర్వాత చాలా కాలానికి విశ్వక్ సేన్ కూడా అలా ఎంట్రీ ఇచ్చిన వాడే.
'ఫలక్ నుమా దాస్' ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అటుపై 'దాస్ కా దమ్కీ' చిత్రాన్ని కూడా అలాగే తెరకెక్కించాడు. అలా తమలో దర్శకత్వ అభిరుచుని కూడా బయట పెట్టారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఇంకా అలాంటి అటెంప్ట్ చేయలేదు. నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చి బాబు వద్ద శిష్యరికం చేసాడు.
కానీ ఇండస్ట్రీ ఆయన్ని హీరోని చేసింది. 'ఆష్టాచెమ్మా' సక్సెస్ అవ్వడంతో అప్పటి నుంచి హీరోగానే కొనసాగుతున్నాడు. స్టార్ గా ఎదిగిన తర్వాత వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ప్రతిభావం తుల్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. కానీ తాను మాత్రం ఇంకా కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు. భారీ స్టార్ డమ్ కలిగిన స్టార్ గా కొనసాగుతున్నాడు. కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడు.
పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి డైరెక్టర్ ఎప్పుడవుతారు? స్వీయా దర్శ కత్వంలో సినిమా ఎప్పుడు ఉంటుంది అంటే? నాని నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. ఫాంలో ఉన్నంత కాలం హీరోగా కొనసాగి అటుపై డైరెక్షన్ వైపు మళ్లుతాడేమో చూడాలి.