తన పోస్టుతో అందరినీ ఆకర్షించిన నాని
రీసెంట్ గా హిట్3తో రూ.100 కోట్ల మార్కు ను అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు.
By: Tupaki Desk | 21 May 2025 1:35 PM ISTరీసెంట్ గా హిట్3తో రూ.100 కోట్ల మార్కు ను అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. అయితే ఈసారి నాని అందరినీ ఆకర్షించింది తన నటనతోనో, సినిమాతోనో కాదు. తాను సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో. గతాన్ని గుర్తు చేసుకుంటూ నాని ఓ స్వీట్ ఫోటోను ఇప్పుడు తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు.
తన అక్క గంటా దీప్తి బర్త్ డే సందర్భంగా నాని తమ చిన్ననాటి ఫోటోను షేర్ చేయగా, ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీప్తి కేవలం నానికి అక్కగా మాత్రమే కాకుండా తన సక్సెస్ లో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. నిర్మాతగా నాని ఎన్నో ప్రశంసలు పొందిన కోర్టు సినిమాకు దీప్తి సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటూ ఆ సినిమాకు దీప్తి ఎంతగానో కష్టపడిందని నానినే వెల్లడించిన విషయం తెలిసిందే.
హిట్ ఫ్రాంచైజ్ సక్సెస్ అవడంలో కూడా దీప్తి పాత్ర చాలానే ఉందని నాని చెప్పాడు. నాని సోదరి దీప్తి కో ప్రొడ్యూసర్ గానే కాకుండా గతంలో మీట్ క్యూట్, అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం కూడా వహించి తన టాలెంట్ ను బయటపెట్టింది. దీప్తి బర్త్ డే సందర్భంగా నాని అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సెల్రబేషన్స్ ను నీతో కలిసి చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నా అని దీప్తితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.
తన సొంత బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న నాని ఆ బ్యానర్ లో తన అక్క దీప్తి ను కూడా భాగం చేసి తన సక్సెస్ లో కీలకంగా మార్చుకున్నాడు. తన కెరీర్ లోని మెయిన్ పిల్లర్స్ లో తన అక్క దీప్తి కూడా ఒకరని నాని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఈ పోస్ట్ కు నాని ఫ్యాన్స్ దీప్తికి విషెస్ తెలుపుతూ, నాని హీరోగా, నిర్మాతగానే కాదు, ఫ్యామిలీ మెంబర్ గా కూడా మంచి విలువలు పాటిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.
