నేచురల్ స్టార్ కి భన్సాలీ ఆఫరా?
బన్సాలీ మరోసారి అద్భుతమైన ప్రేమ కథనే వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాడనే ప్రచారం పీక్స్ లో జరుగుతోంది.
By: Tupaki Desk | 5 April 2025 4:00 AM ISTనేచురల్ స్టార్ నానికి భన్సాలీ ఛాన్స్ ఇచ్చాడా? నాని సైతం ఆఫర్ పట్ల పాజిటివ్ గా ఉన్నాడా? అంటే అవుననే ప్రచారం బాలీవుడ్ మీడియాలో మొదలైంది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అలియాభట్ నటిస్తోంది. పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న మరో క్లాసిక్ లవ్ స్టోరీ ఇది.
బన్సాలీ మరోసారి అద్భుతమైన ప్రేమ కథనే వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాడనే ప్రచారం పీక్స్ లో జరుగుతోంది. ప్రేమికుల హృదయాల్ని పిండేసే సన్నివేశాలు ఎన్నో ఉండబోతున్నాయని...కొన్ని సన్నివేశాలు వాస్తవ జీవితంలో చోటు చేసుకున్న వాటినే తీసుకుంటున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. తాజాగా ఇదే సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా భాగం చేయాలని బన్సాలీ ప్లాన్ చేస్తున్నాడు.
ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దింపాలని ట్రై చేస్తున్నాడుట. సినిమాలో నానికి హీరోయిన్ కూడా ఉంటుం దిట. కథలో భాగంగా ఇద్దరూ భార్య భర్తల పాత్రలు పోషిస్తున్నారుట. ఈ జోడికి కూడా ప్లాష్ బ్యాక్ లో ఓ స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంటుందట. ఈ పాత్రలకు బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కంటే సౌత్ వాళ్లు అయితే పక్కాగా అడెప్ట్ చేసుకుంటారనే ఆలోచనలో భాగంగా నాని పేరు తెరపైకి వచ్చింది. అలాగే హీరోయిన్ గా కూడా సౌత్ భామనే తీసుకోవాలనుకుంటున్నారుట.
తొలుత ఈ పాత్ర కోసం బన్నాలీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అనుకున్నాడుట. కానీ బన్నీ పాన్ ఇండియా మాస్ క్రేజ్ నేపథ్యంలో ఆయన ఒప్పుకుంటాడా? లేదా? అన్న సందిగ్ధంలో భాగంగా నానినే అప్రోచ్ అవుతున్నట్లు తెలిసింది. మరి నాని ఈ ఛాన్స్ తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.
