Begin typing your search above and press return to search.

'మీకు మేమున్నాం!'.. నానికి డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2025 12:46 PM IST
మీకు మేమున్నాం!.. నానికి డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్!
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరో వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నారు.

ఇటీవల వచ్చిన కోర్ట్ మూవీ ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. నాని నిర్మించిన ఆ సినిమా.. చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. నాని.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల మూవీని కూడా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో ప్రాజెక్టును రూపొందించనున్నారు.

అదే సమయంలో హీరోగా ఇటీవల హిట్-3 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో హిట్ ట్రాక్ ను కొనసాగించారు. అంతకుముందు.. హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్నారు. సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా చిత్రాలతో విజయాలు దక్కించుకుని సత్తా చాటారు.

అలా నాని వరుస హిట్స్ అందుకుంటున్నా.. ఆయన సినిమాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. సరిపోదా శనివారం, హాయ్ నాన్న, హిట్ 3 వంటి సినిమాలు అనేక ప్రాంతాలలో నష్టాలను చవిచూశాయని టాక్ వినిపించింది. ఓవర్సీస్ తోపాటు నైజాంలో మంచి వసూళ్లు రాబట్టాయట.

కానీ ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో మాత్రం నష్టాలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. ప్రమోషన్లు ఫుల్ గా ఉన్నప్పటికీ, పాన్ ఇండియా రిలీజ్ లు కనీస ప్రభావాన్ని మాత్రమే చూపించాయని, నాని సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ ను ఎదుర్కొన్నారు. అదే సమయంలో అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు నానికి మద్దతుగా నిలిచారు.

నాని నిర్మించిన కోర్ట్, నటించిన చిత్రం హిట్ 3 సినిమాలు.. సమ్మర్ సీజన్ లో థియేటర్స్ వ్యాపారాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయని డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొన్నారు. ప్రేక్షకులను సినిమాల వైపు తిరిగి ఆకర్షించే కంటెంట్‌ ను అందించినందుకు నానిని ప్రశంసించారు. స్టార్ హీరోలు గ్యాప్ తో చిత్రాలను విడుదల చేస్తున్నారని, నాని వరుసగా అలరిస్తారని కొనియాడారు. తద్వారా నేచురల్ స్టార్ కు మద్దతు పలికారు.