Begin typing your search above and press return to search.

10 ఏళ్ల తర్వాత నానికి అది నచ్చలేదట..!

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 April 2025 4:52 PM
10 ఏళ్ల తర్వాత నానికి అది నచ్చలేదట..!
X

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే చాలు గ్యారెంటీ హిట్ అనే లెవెల్ కి వెళ్లాడు. ముఖ్యంగా న్యూ ఏజ్ టాలెంటెడ్ పీపుల్స్ తో కలిసి పనిచేయడం తో నానికి బాగా కలిసి వస్తుంది. సినిమా బాధ్యత అంతా తన మీద వేసుకుని నాని చేస్తున్న రిస్క్ లో అతనికి తగిన ఫలితాలు అందిస్తున్నాయి. నాని రీసెంట్ ఫాం చూస్తే అందరు షాక్ అవ్వక తప్పదు అనిపించేలా ఉంది.

ఐతే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని ఓ పక్క తన ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు చేస్తూనే మరోపక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ అటెంప్ట్ లు కొనసాగిస్తున్నాడు. తన కెరీర్ లో జెర్సీ లాంటి సినిమాలు చాలా ప్రత్యేకమని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు నాని. అలాంటి సినిమాలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధమే అని అంటున్నాడు. అంతేకాదు ఆ సినిమాలు ఇప్పుడు మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నాడు నాని.

అంతేకాదు ఒకప్పటి తన యాక్టింగ్ కి ఇప్పటి యాక్టింగ్ కి చాలా తేడా ఉందన్న నాని తను నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఇప్పుడు చూస్తే అందులో కొన్ని సీన్స్ ఇంకా బాగా చేయొచ్చు అనిపించిందని అన్నాడు నాని. అఫ్కోర్స్ సినిమా సినిమాకు నటుడిగా పరిణితి సాధిస్తూ పాత్రలో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఐతే నాని ప్రత్యేకంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా గురించి ఎందుకు చెప్పాడంటే ఆ సినిమాలో అతని పాత్ర మొదట స్వార్ధంతో ఒక కన్ ఫ్యూజ్ మైండ్ సెట్ తో ఉంటుంది. ఆ తర్వాత అతని పాత్ర మారుతుంది.

ఆ పాత్రని ఇప్పుడు చూసుకుంటే కొన్ని సీన్స్ లో ఇంకాస్త బెటర్ గా చేసి ఉండొచ్చని చెప్పాడు నాని. మొత్తానికి నాని ఇలా తను చేసిన ఒక సినిమా పాత్ర గురించి ఇంత ఓపెన్ గా చెప్పడం చాలా గొప్ప విషయం. ఈమధ్యనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని నటించిన హిట్ 3 సినిమా మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.