Begin typing your search above and press return to search.

143 మంది స్టార్స్ తో వాట్సాప్ గ్రూప్.. ఇప్పుడేమైంది?

అలాంటి ఒక ప్రయత్నమే టాలీవుడ్ సెలబ్రిటీ వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి లాంటి టాప్ స్టార్స్‌తో పాటు మొత్తం 143 మంది ప్రముఖులు ఉన్నారట.

By:  Tupaki Desk   |   25 April 2025 12:02 PM IST
Nani Reveals About Whatsapp Group
X

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు సినీ తారలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. షూటింగ్‌ల బిజీ షెడ్యూల్‌లోనూ నటీనటులు ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఒక ప్రయత్నమే టాలీవుడ్ సెలబ్రిటీ వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి లాంటి టాప్ స్టార్స్‌తో పాటు మొత్తం 143 మంది ప్రముఖులు ఉన్నారట.

ఇది చాలామందికి కొత్త విషయమే. ఈ గ్రూప్ గురించి ఇప్పటివరకు పలుమార్లు సమాచారం వచ్చిందైనా, తాజాగా నాని చెప్పిన వివరణ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ప్రమోషన్, మ్యూచువల్ మోటివేషన్, ఫ్రెండ్‌షిప్‌ కోసం ఈ గ్రూప్‌ను సృష్టించామని నాని వివరణ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ, “ప్రారంభంలో ఈ గ్రూప్ చాలా యాక్టివ్‌గా ఉండేది. ప్రతిరోజూ పలు విషయాలపై చర్చలు జరిగేవి. సినిమాల టీజర్లు, ట్రైలర్లు పోస్టు చేసి అందరూ తమ అభిప్రాయాలను పంచుకునే వారమం. కానీ ప్రస్తుతం అంత రేంజ్‌లో యాక్టివిటీ లేదు.

ఎందుకంటే చాలా మంది స్టార్స్ ఫోన్ నంబర్లు మార్చేసారు, ఎవరికీ సమయం ఉండదు. అందరూ బిజీగా ఉంటున్నారు,” అని వివరించాడు. ఈ గ్రూప్‌ను ఏదో మార్చేందుకు కాకుండా, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వేదికగా సృష్టించామని నాని చక్కగా వివరించాడు. “మేమంతా ఒకే పరిశ్రమలో ఉన్నా, ఒకే సమయంలో ఆలోచించలేము. అందుకే ఈ గ్రూప్ ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఎవరు ఏమైనా షేర్ చేస్తే.. వెంటనే రెస్పాన్స్ రావడం లేదు. కారణం గ్రూప్ మ్యూట్‌లోనే ఉంటుంది!” అని సరదాగా చెప్పుకొచ్చాడు.

గ్రూప్ యాక్టివిటీ తగ్గడానికి మరో కారణం స్పామ్ మెసేజ్‌లే అని నాని తెలిపారు. “చాలా మంది కంటెంట్ కాకుండా జోక్స్, ఫార్వర్డ్స్ పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని విషయాలు బోరింగ్ అవ్వడం వల్ల మెల్లగా ఆసక్తి తగ్గిపోయింది. ఫోన్ ఓపెన్ చేస్తే 70–100 అన్‌రీడ్ మెసేజ్‌లు కనిపిస్తాయి. వాటిని స్క్రోల్ చేయడం కష్టమే. అందుకే చాలామంది ఈ గ్రూప్‌కి అంతగా స్పందించకపోతున్నారు” అంటూ నిజాయితీగా వివరించాడు.

ఇక మరోవైపు నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో నాని ఈ విధంగా పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. నాని కెరీర్ లోనే అత్యంత హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.