Begin typing your search above and press return to search.

నాని ఖాతాలో నాలుగోది.. వాళ్లకి ఎసరు పెడుతున్నాడుగా..?

న్యాచురల్ స్టార్ నాని ఓ పక్క వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ నుంచి పక్కా హిట్ అనే రేంజ్ కి వచ్చాడు

By:  Tupaki Desk   |   7 April 2025 8:49 PM IST
Nani’s Commercial Ad
X

న్యాచురల్ స్టార్ నాని ఓ పక్క వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ నుంచి పక్కా హిట్ అనే రేంజ్ కి వచ్చాడు. నాని కథల ఎంపిక వాటికి తను పెడుతున్న ఎఫర్ట్ ఇదంతా అతనికి సూపర్ ప్లస్ అవుతుంది. అంతేకాదు సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని ఇప్పుడు కెరీర్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడు. త్వరలో హిట్ 3 తో రాబోతున్న నాని నెక్స్ట్ ప్యారడైజ్ గా దిగుతున్నాడు.

సక్సెస్ ఫుల్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నాని ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నాడు. అంతకుముందు స్ప్రైట్, పల్పీ ఆరెంజ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనలు చేసిన నాని రెండేళ్ల క్రితం మినిస్టర్ వైట్ అనే ఖద్దర్ షర్ట్ దోతిలకు కూడా బ్రాండింగ్ చేశాడు. చిన్నగా తన వాణిజ్య ప్రకటనల ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు నాని.

లేటెస్ట్ గా నాని ఆశీర్వాద్ కారం కు బ్రాండింగ్ చేస్తున్నాడు. రెండు రోజులుగా నాని ఆశీర్వాద్ యాడ్ టెలికాస్ట్ అవుతుంది. అది చూసిన న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటి ప్రతి వంటలో నాని అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నాని హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించడమే కాదు ఇలా వాణిజ్య ప్రకటనలతో మిగతా స్టార్స్ కి కూడా పోటీ వస్తున్నాడు.

నాని ఆశీర్వాద్ యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడని తెలుస్తుంది. వరుస సక్సెస్ లతో నాని రేంజ్ పెరిగింది. అంతేకాదు నాని తో సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. నాని సినిమా ఓకే చేశాడా ఇక సినిమా సూపర్ హిట్టే అనే రేంజ్ కి వెళ్లాడు. సినిమాకు తను పడే కష్టమే తనకు తిరిగి ప్రతిఫలంగా వస్తుందని నమ్ముతాడు నాని. అందుకే అతను సక్సెస్ ఫుల్ ఉన్నాడు.

హిట్ 3 తో మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని నెక్స్ట్ ప్యారడైజ్ సినిమాను మాత్రం నెక్స్ట్ మార్చికి రిలీజ్ లాక్ చేశారు. ఐతే మార్చి 28న నాని ప్యారడైజ్ రిలీజ్ అనౌన్స్ చేస్తే ఒకరోజు ముందు రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించారు. మరి ఈ సినిమాలు ఆ డేట్ కి వస్తాయా లేదా అన్నది చూడాలి.