Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : తెల్లటి చీర కట్టు అందాలతో కవ్వింత

దీపావళి సందర్భంగా తన ఫాలోవర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోలను షేర్ చేసిన నందిని రాయ్‌. సోషల్ మీడియాలో చాలా మంది హాట్ బ్యూటీస్ రెగ్యులర్ గా హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 10:50 AM GMT
పిక్ టాక్ : తెల్లటి చీర కట్టు అందాలతో కవ్వింత
X

తెలుగు లో పలు సినిమా ల్లో నటించినా కూడా హీరోయిన్‌ గా నందిని రాయ్‌ పెద్దగా గుర్తింపును దక్కించుకోలేక పోయింది. కానీ తెలుగు బిగ్‌ బాస్ లో కంటెస్టెంట్‌ గా మాత్రం మంచి గుర్తింపును దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు సినిమాల్లో సక్సెస్ వచ్చినా రాకున్నా అదృష్టం కొద్ది కొనసాగుతూనే ఉంది.


ఈ అమ్మడు సక్సెస్‌ లేకున్నా కొనసాగడానికి కారణం అందాల ఆరబోత అంటూ చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమే అని ఈ చీర కట్టు పోటోలను చూస్తే అనకుండా ఉండలేరు అనిపిస్తుంది. తెల్లటి చీర కట్టు లో పింక్ స్కిన్‌ టోన్ తో చూపు తిప్పుకోనివ్వనంత అందంగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.


దీపావళి సందర్భంగా తన ఫాలోవర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోలను షేర్ చేసిన నందిని రాయ్‌. సోషల్ మీడియాలో చాలా మంది హాట్ బ్యూటీస్ రెగ్యులర్ గా హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది స్కిన్ షో చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ నందిని రాయ్ హాట్ ఫోటోలు కన్నుల విందుగా ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ రేంజ్‌ లో అందాల విందు చేస్తూ, రెగ్యులర్‌ గా సోషల్ మీడియా లో సందడి చేస్తే సినిమాల్లో కాకున్నా కచ్చితంగా వెబ్‌ సిరీస్ ల్లో అయినా ఆఫర్లు వస్తాయి అంటూ ఆమె అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్ ల్లో నటించి తన అందాలతో కవ్వించిన ముద్దుగుమ్మ నందిని రాయ్ తప్పకుండా మరోసారి వెబ్ సిరీస్ లో తన పాత్రతో మెప్పించడం ఖాయం అనిపిస్తుంది.