Begin typing your search above and press return to search.

నందిని రాయ్.. చలిలో కూడా హీటెక్కించే అందం..

టాలీవుడ్ లో అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది హీరోయిన్లకు ఛాన్సులు రాట్లేదు. అలాంటి వారిలో హైదరాబాదీ అమ్మడు నందినీ రాయ్ ఒకరు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 10:58 AM GMT
నందిని రాయ్.. చలిలో కూడా హీటెక్కించే అందం..
X

టాలీవుడ్ లో అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది హీరోయిన్లకు ఛాన్సులు రాట్లేదు. అలాంటి వారిలో హైదరాబాదీ అమ్మడు నందినీ రాయ్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. అవకాశాలను మాత్రం అందుకోవడంలో విఫలం అవుతోంది. అందుకే అడపాదడపా సినిమాలు చేస్తోంది.


అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో సందడి చేస్తుంటుందీ బ్యూటీ. తన అభిమానులను అలరిస్తూనే ఉంటోంది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది.


సోషల్ మీడియాలో ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తోంది నందినీ రాయ్. అదిరే పోజులతో పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. తాజాగా బ్లాక్ బికినీ కమ్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. Casual vibes and comfort all in one అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. అందమంటే నందినీ రాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్ సినిమాల కంటే ముందు మోడలింగ్ రంగంలో సందడి చేసింది. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైంది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా పాపులర్ అయింది. నేషనల్ లెవెల్ లో ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆ సమయంలో ఫ్యామిలీ ప్యాక్ అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా మారిపోయింది.


ఆ తర్వాత మాయ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా కొన్ని సినిమాల్లో నటించినా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అదే సమయంలో బిగ్ బాస్ రెండో సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.


కానీ ఆ షో తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని భావించినా వర్కౌట్ కాలేదు. ఇటీవలే గాలి వాన సిరీస్‌ తో పాటు వారిసు, భాగ్ సాలే మూవీల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. మరికొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది.