Begin typing your search above and press return to search.

సమంత ఔట్​.. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ కావాలట

నందిని రెడ్డి కూడా తన సినిమా కోసం ఫ్రెష్ పేస్​ను తీసుకునేందుకు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 9:50 AM GMT
సమంత ఔట్​.. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ కావాలట
X

సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి విదేశాల్లో చిల్ కొడుతూ లైఫ్​ను ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ సమంత. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన పొటోలు, చూసిన ప్రదేశాలు, చేసిన రీల్స్​ వంటివి సోషల్​ మీడియాలో తన ఫాలోవర్స్​, అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ బ్రేక్​ కోసం తాను గతంలో ఒప్పుకున్న కొన్ని సినిమాల అడ్వాన్స్​లు కూడా తిరిగి ఇచ్చనట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఆ చిత్రాల వివరాలేంటో తెలియదు.

అయితే ఇప్పుడామె గురించి మరో వార్త బయటకు వచ్చింది. హీరోయిన్‌ స‌మంత‌ బ్రేక్ తీసుకోకముందు.. క‌ష్ట‌స‌మ‌యాల్లో త‌న‌కు అండ‌గా నిలిచిన స‌న్నిహితుల్లో ఒకరైన నందినిరెడ్డితో సినిమా చేయబోతుందని ప్రచారం సాగింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన జ‌బ‌ర్దస్త్​, ఓ బేబీ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక బ్రేక్ తర్వాత సమంత.. నందిని రెడ్డితో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సమంతా ఇప్పుడా సినిమా చేయట్లేదని తెలిసింది. నందిని రెడ్డి కూడా తన సినిమా కోసం ఫ్రెష్ పేస్​ను తీసుకునేందుకు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో ఆమె నిత్యా మేనన్​, మాళవిక నాయర్ వంటి హీరోయిన్లను ఎలా తీసుకొచ్చారు, అలా ఇప్పుడు కూడా కొత్త అమ్మాయిని తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.

కాగా, ఈ సినిమా కూడా నందిని రెడ్డి గ‌త సినిమాల శైలిలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కబోతుందట. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అతడి సరసన కొత్త అయ్మాయిని పరిచయం చేస్తే బాగుంటుందని నందిని అనుకుంటున్నారట. ఎలాగో సిద్ధు జొన్నల్లగడ్డ నటిస్తున్న డీజీ టిల్లు కూడా చివరి దశకు చేరుకుంది. ఈ లోగా అమ్మాయిని వెతికేసి తన సినిమాను షురూ చేయాలని నందిని రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. చూడాలి మరి నందిని రెడ్డి ఎవర్ని తీసుకొస్తారో..

ఇకపోతే నందిని రెడ్డి చివరిగా ఈ ఏడాది సంతోశ్ శోభన్​ - మాళవిక నాయర్​తో అన్నీ మంచి శకునములే చిత్రం చేశారు. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకులను నిరాశ పరిచింది.