పెద్ద తప్పే చేసానంటోన్న హాట్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే `లైగర్` సినిమాలో నటించి అతి పెద్ద తప్పు చేసానని పబ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది.
By: Tupaki Desk | 28 May 2025 7:24 AMబాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే `లైగర్` సినిమాలో నటించి అతి పెద్ద తప్పు చేసానని పబ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ సినిమా చేయడం వల్ల టాలీవుడ్ లో కెరీర్ ముగిసిపోయింది? అన్న తీరున మాట్లా డింది. అప్పటికే హిందీలో మూడు సినిమాలు చేసి తెలుగు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో పూరి జగన్నాధ్ బాలీవుడ్ హీరోయిన్లు అందర్నీ పక్కనబెట్టి? మరి అనన్యా పాండే ని ఎంపిక చేసాడు.
పూరి తో ఛాన్స్ అని అనన్యా పాండే కూడా మరో ఆలోచన లేకుండా కమిట్ అయింది. కట్ చేస్తే లైగర్ డిజాస్టర్ గురించి తెలిసిందే. దీంతో అనన్యా పాండే ఒక్కసారిగా అవకాశం ఇచ్చిన పూరిపైనే విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఈసారి తెలుగు సినిమా కమిట్ అయ్యే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకుం టానని చెప్పుకొచ్చింది. తాజాగా నందిని రాయ్ కూడా విజయ్ `వారసుడు` అనే తెలుగు సినిమా చేసి పెద్ద తప్పు చేసానంటూ మీడియా ముందుకొచ్చింది.
ఈ సినిమాలో నటించినందుకు బాదపడుతున్నట్లు తెలిపింది. ఈ సినిమా ప్లాప్ కారణంగా నెగిటివ్ ఇంప్రెసన్ పడిందని తెలిపింది. `వారసుడు` తరహా పాత్రలు మళ్లీ చేయనంటూ వాపోయింది. నందిని రాయ్ పెయిన్ లో అర్దముంది. సినిమాకి కమిట్ అయ్యే ముందు చిన్న రోల్ కాదని...రోల్ పెద్దదని `వారసుడు` టీమ్ చెప్పిందిట. ప్రకాస్ రాజ్ కుమార్తె పాత్ర శ్రీకాంత్ ని రెచ్చగొట్టి అతడి కుటుంబాన్ని విడదీసే రోల్ అట అది.
దీనికి సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ కూడా చేసారుట. కానీ ఎడిటింగ్ లో మొత్తం సీన్లు అన్ని తీసేసారుట. ఆ విషయం కూడా తను సినిమా చూసే వరకూ తెలియదని తెలిపింది. రిలీజ్ అనంతరం తన స్నేహితులు ఫోన్ చేసి ఇలాంటి సినిమా ఎందుకు చేసావ్ అని తిట్టిపోసారుట.