Begin typing your search above and press return to search.

ఈ దర్శకుడికి దగ్గరగా మోక్షజ్ఞ!

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాక్టర్ గా ఎంట్రీకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాడు

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:38 AM GMT
ఈ దర్శకుడికి దగ్గరగా మోక్షజ్ఞ!
X

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాక్టర్ గా ఎంట్రీకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాడు. డాన్స్, ఫైట్స్ నేర్చుకుంటున్నాడు. యాక్టింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లుక్ పరంగా బెటర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన డెబ్యూ సమయానికి పెర్ఫెక్ట్ హీరోయిక్ మెటీరియల్ గా మారాలని మోక్షజ్ఞ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ అవ్వడంపై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది కచ్చితంగా మోక్షజ్న డెబ్యూ ఉంటుందని, అది కూచా పెర్ఫెక్ట్ లాంచింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఏ దర్శకుడి చేతుల మీదుగా మోక్షజ్ఞని టాలీవుడ్కి పరిచయం చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే భగవంత్ కేసరి మూవీ సమయంలో మోక్షజ్ఞ ఎక్కువగా సెట్స్ కి వస్తూ ఉండేవారంట.

అలాగే దర్శకుడు అనిల్ రావిపూడితో మంచి క్లోజ్ బాండింగ్ ఏర్పడిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా మోక్షజ్ఞ పార్టిసిపేట్ చేస్తున్నాడు. అన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నాడు. అనిల్ రావిపూడి వర్క్ స్టైల్ మోక్షజ్ఞకి నచ్చడంతో అతనితో ట్రావెల్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ సింక్ అయితే మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మోక్షజ్ఞ కూడా మొదటి చిత్రంతోనే ఏదో యాక్షన్ హీరోగా పరిచయం అయిపోవాలనే ఆలోచన పెట్టుకోవడం లేదంట. మంచి ఎంటర్టైన్మెంట్ కథతో హీరోగా డెబ్యూ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు బాలయ్య పరిశీలిస్తున్నారు. వారిలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు.

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ అనిల్ చేతుల మీదుగా ఉండొచ్చని చిత్రపురిలో వినిపిస్తోన్న మాట. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి వర్క్ ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తోన్న మోక్షజ్ఞ కూడా అతనితో సినిమాకి మొగ్గు చూపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.