Begin typing your search above and press return to search.

'డెవిల్' బోస్ రహస్యం.. పొరపాటు లేకుండా..

నందమూరి కళ్యాణ్ రామ్ ఈనెల 29న 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:37 AM GMT
డెవిల్ బోస్ రహస్యం.. పొరపాటు లేకుండా..
X

నందమూరి కళ్యాణ్ రామ్ ఈనెల 29న 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాని నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే గతంలో వచ్చిన నిఖిల్ 'స్పై' సినిమాతో కళ్యాణ్ రామ్ 'డెవిల్' కి లింక్ ఉందని ఈ రెండు సినిమాల మెయిన్ ప్లాట్ ఒకే విధంగా ఉంటాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు స్పై థ్రిల్లర్స్ కావడం, దానికి తోడు రెండు సినిమాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ గురించి చూపించబోతున్నారు. నిఖిల్ 'స్పై' మూవీలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ఫైల్ ని కనుగొనే మిషన్లో భాగంగా ఈ సినిమా సాగుతుంది.

ఇక తాజాగా రాబోతున్న కళ్యాణ్ రామ్ 'డెవిల్' కథ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య మరణం చుట్టే తిరుగుతుంది. అయితే సుభాష్ చంద్రబోస్ మిస్టరీని ఆసక్తికరంగా చూపించడంలో 'స్పై' మూవీ విఫలమైంది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అందుకుంది. కథలో సుభాష్ చంద్రబోస్ కి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ రిలీజ్ కి ముందు నిఖిల్ మాత్రం సుభాష్ చంద్రబోస్ పేరుతోనే ఈ సినిమాని తెగ ప్రమోట్ చేసుకున్నాడు.

దాంతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తీరా విడుదల అయ్యాక ఆడియన్స్ మెప్పు పొందలేకపోయింది. ఇక డెవిల్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ చూపించలేదు. ఇదే విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ని అడిగితే డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా అలా ఎందుకు రహస్యంగా ఉంచారో సినిమా చూస్తేనే తెలుస్తుంది అంటూ చెప్పాడు. దాని గురించి చూపించి ప్రేక్షకుల్లో లేనిపోని అంచనాలను పెంచడం ఇష్టం లేదని, కానీ నేతాజీ గురించి చూపించే డీటెయిల్స్ సినిమాలో అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని డెవిల్ లో చూపించబోతున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇక్కడ నిఖిల్ చేసిన తప్పును కళ్యాణ్ రామ్ ఏ మాత్రం చేయలేదు. డెవిల్ సినిమాలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ గురించి ఎలా చూపిస్తారు అనే విషయం పక్కన పెడితే కళ్యాణ్ రామ్ మాత్రం ముందు నుంచే ఆడియన్స్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయకుండా జాగ్రత్త పడ్డాడనే చెప్పాలి.