Begin typing your search above and press return to search.

దిల్ రాజు 'డెవిల్' డేర్?

ఈ మధ్యకాలంలో దిల్ రాజు నిర్మాతగా కంటే డిస్టిబ్యూటర్ గానే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:53 AM GMT
దిల్ రాజు డెవిల్ డేర్?
X

ఈ మధ్యకాలంలో దిల్ రాజు నిర్మాతగా కంటే డిస్టిబ్యూటర్ గానే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇతర భాషా చిత్రాలకి సంబంధించి రైట్స్ సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేస్తూ భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. జైలర్ మూవీ దిల్ రాజుకి కోట్లు కురిపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ సినిమా కూడా దిల్ రాజుకి సూపర్ కలెక్షన్స్ ని అందించింది.

నిర్మాతగా స్పీడ్ తగ్గిన డిస్టిబ్యూటర్ గా మాత్రం దిల్ రాజు చాలా యాక్టివ్ గా ఈ ఏడాది అరడజనుకి పైగా సినిమాలని తన ప్రొడక్షన్ ద్వారానే రిలీజ్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. నిర్మాతగా శాకుంతలం లాంటి డిజాస్టర్, బలగం లాంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా డెవిల్.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో డెవిల్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని రీసెంట్ గా నిర్మాత అభిషేక్ నామా దిల్ రాజుకి చూపించారంట.

మూవీ నచ్చడంతో ఆంధ్రా డిస్టిబ్యూషన్ రైట్స్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేశారు. అన్ని భాషలకి సంబందించిన బిజినెస్ కంప్లీట్ అయ్యిందంట. కళ్యాణ్ రామ్ కెరియర్ లో కూడా భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. దిల్ రాజు సపోర్ట్ దొరకడంతో థియేటర్స్ కి డోకా ఉండదని భావిస్తున్నారు.

అయితే డంకీ, సలార్ సినిమాలు రిలీజ్ అయిన వారం రోజుల్లోనే డెవిల్ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. సలార్ సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఆ ఇంపాక్ట్ డెవిల్ ఓపెనింగ్స్ మీద ఉంటుంది. అయిన కానీ దిల్ రాజు ధైర్యం చేసి రైట్స్ తీసుకున్నాడు అంటే కచ్చితంగా మూవీలో విషయం ఉండే ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.