Begin typing your search above and press return to search.

వారసుడి వయసు పెరిగిపోతోంది.. ఎంట్రీ ఎప్పుడో..?

ఇవన్నీ వెరసి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు అతని ఎంట్రీ ఉంటుందనేది తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 4:40 AM GMT
వారసుడి వయసు పెరిగిపోతోంది.. ఎంట్రీ ఎప్పుడో..?
X

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. బాలయ్య కూడా చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అలాగే మోక్షజ్ఞ కూడా యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడనే మాట వినిపించింది. అతనిలో అద్భుతమైన యాక్టింగ్ స్కిల్ ఉందని ప్రస్తుతం నటులుగా ఉన్న మోక్షజ్ఞ ఫ్రెండ్స్ కూడా ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.

ఇవన్నీ వెరసి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు అతని ఎంట్రీ ఉంటుందనేది తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. గతంలో బాలయ్య మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చెప్పిన కూడా ఎప్పుడనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ పబ్లిక్ ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. లుక్స్ పరంగా కూడా గతంలో కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరో మెటీరియల్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

బాలయ్య బాబు అభిమానులు అప్పుడే మోక్షజ్ఞని ఆరాధించడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే బాలయ్య పుట్టినరోజుకి 20 రోజుల సమయం ఉంది. ఆ రోజైన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, దర్శకుడు ఎవరు, ఏ ప్రొడక్షన్ హౌస్ లో పరిచయం అవుతున్నాడు అనేది చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాలయ్యని అడుగుతున్నారు.

ఇప్పటికే మెగా, అక్కినేని వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిపోయారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నా కూడా బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు కూడా మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాయి. స్టార్ కమర్షియల్ దర్శకులు మోక్షజ్ఞ ఇంట్రడక్షన్ కోసం మంచి కథలు సిద్ధం చేసుకొని ఉన్నారు.

బాలయ్య నిర్ణయమే ఫైనల్ అనే మాట వినిపిస్తోంది. అసలు కొడుకు ఎంట్రీ విషయంలో సరైన క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికే మోక్షజ్ఞకు 29లో ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 6కి 30 లోకి అడుగు పెడతాడు. ప్రస్తుతం కాలంలో ఎంట్రీ ఇచ్చే కొత్త హీరోలు పాతికేళ్ల లోపే తెరపై కనిపిస్తున్నారు. కను మోక్షజ్ఞ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకో మిస్టరీగానే ఉంది.

ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య బాబు నుంచి ఒక స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో NBK 109 మూవీ చేస్తున్నాడు. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. దీని తర్వాత బోయపాటితో అఖండ 2 మొదలు కానున్నట్లు తెలుస్తోంది.