Begin typing your search above and press return to search.

బాలయ్య.. ఆ డైరెక్టర్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది?

మళ్ళీ బాలయ్యతో లెజెండ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:18 AM GMT
బాలయ్య.. ఆ డైరెక్టర్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది?
X

బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ అంటే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కనిపిస్తాయి. బోయపాటి కెరియర్ లో మొదటి సినిమా భద్ర తర్వాత వెంకటేష్ తో తులసి సినిమా చేసాడు. అది ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ బాలయ్యతో చేసిన సింహా మూవీ ఒక్కసారిగా అతన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. ఎన్టీఆర్ తో చేసిన దమ్ము ఫ్లాప్ అయ్యింది.


మళ్ళీ బాలయ్యతో లెజెండ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బోయపాటి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి నందమూరి ఫ్యాన్స్ లో ఒక హైప్ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత అల్లు అర్జున్ తో సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న మళ్ళీ రెండు ఫ్లాప్ లు బోయపాటి ఖాతాలో చేరాయి. బాలయ్యతో మూడో సినిమాగా అఖండ మూవీ బోయపాటి చేశారు. ఈ మూవీ బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బాలయ్య మార్కెట్ రేంజ్ కూడా అఖండతో అమాంతం పెరిగిపోయింది. అయితే నెక్స్ట్ రామ్ తో బోయపాటి చేసిన స్కంద మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కారణంగా బోయపాటిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. బోయపాటి మళ్ళీ తన లక్కీ స్టార్ బాలయ్యతోనే నెక్స్ట్ సినిమా ఒకే చేసుకున్నారు. నందమూరి ఫ్యాన్స్ కి ఈ కాంబినేషన్ మీద చాలా నమ్మకం ఉంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చిన నేపథ్యంలో అఖండకి మించి నెక్స్ట్ మూవీ ఉండాలని బాలయ్య అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే బాలయ్యతో బోయపాటి చేయబోయేది అఖండ సీక్వెల్ నా లేదంటే కొత్త కథ అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం మంచి కథని బోయపాటి సిద్ధం చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

రాబోయే ఉగాదికి బోయపాటి, బాలయ్య మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని, ఆరోజు కొత్త కథతోనా, అఖండ సీక్వెల్ స్టోరీనా అనే క్లారిటీ కూడా రావొచ్చని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఏపీలో ఎన్నికల కారణంగా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఎలక్షన్స్ అయ్యాక తిరిగి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని టాక్. ఈ ఏడాది ఆఖరులో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.