Begin typing your search above and press return to search.

NBK110 - బాలయ్య ప్లాన్ ఏంటి?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను బాబి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   14 March 2024 5:30 AM GMT
NBK110 - బాలయ్య ప్లాన్ ఏంటి?
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను బాబి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసాయి తప్పకుండా సినిమా ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని దర్శకుడు తెలియజేశాడు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత నందమూరి బాలకృష్ణ తన 110 సినిమాను ఎవరితో చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇదివరకే కొంతమంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ బాలకృష్ణ మాత్రం ఎలాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ హడావిడిలోనే ఆయన ఎక్కువగా బిజీ అవుతున్నారు. కాబట్టి స్టోరీల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునేంత సమయం కూడా దొరకడం లేదు. వీలైనంత తొందరగా బాబి సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టామ్ ప్రకారం నందమూరి బాలకృష్ణ తన 110 సినిమా విషయంలో ఇటీవల ఒక దర్శకుడికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. బోయపాటి శ్రీను. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే నాలుగో సారి కూడా బాలకృష్ణ బోయపాటి తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. రీసెంట్ గా మరోసారి బోయపాటిని కలిసిన బాలయ్య ఇదివరకే వినిపించిన ఒక కథను డెవలప్ చేయమని సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

దాదాపు బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే బాలయ్య కూడా ఆ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాడు. ఒకవేళ బాలయ్యకు నచ్చితే మాత్రం వచ్చే ఉగాదికి ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే బోయపాటి ఆ మధ్య గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో లేదా సూర్యతో సినిమా ఉండవచ్చు అని టాక్ కూడా గట్టిగానే వినిపించింది. నిజానికి ఆ ఇద్దరు హీరోలతో బోయపాటి టచ్ లోనే ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ అయితే ఓకే కాలేదు. ఇక ఇప్పుడు సడన్ గా మళ్ళీ లిస్టులోకి బాలయ్య బాబు వచ్చాడు. మరి ఈ కాంబినేషన్ గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందా లేదంటే మరొక బ్యానర్లో ఉంటుందా.. అనేది కాలమే సమాధానం చెప్పాలి.