Begin typing your search above and press return to search.

బాల‌య్య సినిమాలో డ‌బ్బా రాణి!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 April 2024 6:44 AM GMT
బాల‌య్య సినిమాలో డ‌బ్బా రాణి!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మాస్ ఇమేజ్ కి ...బాబి మాస్ కంటెంట్ తోడ‌వ్వ‌డంతో అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఇద్ద‌రు అభి మానుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తోన్న పక్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. చిరంజీవికి `వాల్తేరు వీర‌య్య‌`తో బాబి ఎలాంటి హిట్ ఇచ్చాడో? బాల‌య్య‌కి అలాంటి హిట్ ఇవ్వ‌బోతున్నాడ‌నే అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి ఇలాంటి కాంబినేష‌న్ సెట్ అయిన‌ప్పుడు మాంచి పెప్పీ ఐట‌మ్ సాంగ్ లేక‌పోతే ఎలా? అలాంటి పాట లేకుండా సినిమా ఉంటుందా? అని అభిమానులు అనుకోరు.

అందుకే వాళ్ల కోసం అందిరిపోయే ఐటం పాట ఒక‌టి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఐటం గాళ్ ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు గానీ..ఆ ఐటం పాట‌లో క‌నిపించే న‌టి పాత్ర పేరు మాత్రం డ‌బ్బా రాణి అట‌.. కుర్రాళ్ల‌కు మ‌తిచెడే రేంజ్ లో ఈమాస్ పాట పున‌కాలు తెప్పిస్తుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఇంకా ఇందులో హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది క‌న్ప‌మ్ కాలేదు. అలాగే ఐటం భామ కూడా ఫైన‌ల్ కాలేదు. ఆ భామ ఎవరైనా మాస్ బీట్ మాత్రం అందిరిపోతుంద‌ని తెలుస్తోంది.

బాబి అలాంటి మాస్ సాంగ్ల్ ని డిజైన్ చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌న్నింటిలోనే ఐటం పాట‌లు మంచి స‌క్సెస్ అయ్యాయి. వాటితో అందులో న‌టించిన భామ‌ల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. మ‌రి బాల‌య్య 109 లో ఐటం భామ ఎవ‌ర‌వుతుందో చూడాలి. అతి త్వ‌ర‌లోనే ఆ విష‌యం తెలిసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది.

బాల‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌టంతో పాటు, బ‌య‌ట తీవ్ర‌మైన ఎండ‌లు వీస్తుండ‌టంతో ఎలాంటి షూటింగ్ చేయ‌లేదు. మ‌ళ్లీ జూన్ లో బాల‌య్య తిరిగొచ్చిన త‌ర్వాత సెట్స్ కి వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ సినిమా త‌ర్వాత బాబి మ‌రోసారి సీనియ‌ర్ హీరోనే డైరెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. ఈ లిస్ట్ లో నాగార్జున‌..వెంక‌టేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంత‌వ‌ర‌కూ నాగార్జున‌తో బాబి సినిమా చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముందుగా ఆయ‌న‌తోనే ముందుకెళ్లే అవ‌కాశం ఉంది.