Begin typing your search above and press return to search.

వీర మాస్ బాలయ్య ఆ రేసులో ఉంటాడా..?

బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2024 11:30 PM GMT
వీర మాస్ బాలయ్య ఆ రేసులో ఉంటాడా..?
X

సీనియర్ హీరోల్లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు నందమూరి బాలకృష్ణ. లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరితో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య బాబు ప్రజంట్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. బాలయ్య మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వీర మాస్ అన్న టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస సూపర్ హిట్లతో అదరగొట్టేస్తున్న బాలకృష్ణ ఎన్.బి.కె 109 తో కూడా వీర మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తన ప్రతి సినిమాలో యాక్షన్ విషయంలో మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే బాబీ బాలకృష్ణ మాస్ స్టామినాని ఫుల్లుగా వాడేస్తున్నారని తెలుస్తుంది. షూటింగ్ దశ నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

NBK 109 సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. అసలైతే జూన్, జూలై కల్లా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉన్నా రెండు నెలల నుంచి బాలకృష్ణ షూటింగ్ ఆపేయడంతో సినిమా కాస్త లేట్ అవుతుంది. అక్టోబర్, నవంబర్ లో ఆల్రెడీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. అందుకే డిసెంబర్ కి వీర మాస్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఆల్రెడీ డిసెంబర్ క్రిస్మస్ రేసులో నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు వస్తున్నాయి. మరి బాలకృష్ణ సినిమా క్రిస్ మస్ కి తెస్తారా లేదా అఖండ సినిమా సెంటిమెంట్ తో ఫస్ట్, సెకండ్ వీక్ లో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. బాలకృష్ణ మాస్ స్టామినా చూపించేందుకు కె.ఎస్ బాబీ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. బాబీ సినిమాను త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కల్లా అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలకృష్ణ. అంతేకాదు అన్ స్టాపబుల్ సీజన్ 3 ని కూడా త్వరలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. బాలకృష్ణ స్పీడ్ చూసి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.