Begin typing your search above and press return to search.

బాలయ్యతో బాబీ డియోల్… ఆ సీన్స్ నెక్స్ట్ లెవల్

బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:28 AM GMT
బాలయ్యతో బాబీ డియోల్… ఆ సీన్స్ నెక్స్ట్ లెవల్
X

బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ ఏడాది గ్యాప్ తీసుకొని బాలయ్యకి అదిరిపోయే కథ సిద్ధం చేసి మూవీని స్టార్ట్ చేసేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం నడుస్తోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ స్టార్, యానిమల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన బాబీ డియోల్ ని ఖరారు చేశారు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా బాబీ డియోల్ ని ముందుగా టాలీవుడ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎప్పుడు మళ్ళీ సెట్స్ పైకి వెళ్తుందనేది క్లారిటీ లేదు.

దీంతో బాలయ్య మూవీనే బాబీ డియోల్ కి తెలుగు డెబ్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో బాబీ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని బాలయ్య కోసం సిద్ధం చేసారంట. ముఖ్యంగా బాలయ్య, బాబీ డియోల్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, సీక్వెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయంట. ఇద్దరి మధ్య పోటాపోటీగా సన్నివేశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. బాబీ డియోల్ ని నెక్స్ట్ లెవల్ లోనే ఈ మూవీలో డైరెక్టర్ బాబీ ఆవిష్కరిస్తున్నారు.

ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో చివరి 40 నిమిషాల ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా ఉంటుందంట. గతంలో నాగవంశీ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ ఏడాదిలోనే మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. బాలయ్య చివరి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో నాలుగో హిట్ ని ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నందమూరి హీరో తారక్ కి జై లవకుశతో ఇప్పటికే బాబీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.

ఇప్పుడు బాలయ్యకి కూడా అంతకుమించి హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదని తెలుస్తోంది. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే వారిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.