Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం ఆ సీనియర్ బ్యూటీ.. నిజమేనా?

ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలని షూట్ చేశారు. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ నుంచి రాబోతోన్న సినిమా ఇదే కావడం విశేషం

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:30 AM GMT
బాలయ్య కోసం ఆ సీనియర్ బ్యూటీ.. నిజమేనా?
X

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. బాలయ్య స్టైల్ లోనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ సినిమా సిద్ధం అవుతోంది. బాబీ డియోల్ ఈ మూవీలో బాలయ్యకి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలని షూట్ చేశారు. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ నుంచి రాబోతోన్న సినిమా ఇదే కావడం విశేషం. వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ కి సెకండ్ ఇన్నింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు. ఇప్పుడు బాలయ్యకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు.

ఈ మూవీ కోసం బాలయ్య కెరియర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక మూవీలో హీరోయిన్ కోసం బాబీ కొంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నయనతార పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే రెమ్యునరేషన్ కారణంగా నయనతారను డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది. జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నయనతార ప్రస్తుతం 15 కోట్లకి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. ఆ స్థాయిలో ఇచ్చుకునే ఛాన్స్ లేకపోవడం వేరే అప్షన్స్ చూస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్ గా ప్రియమణి పేరు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో ప్రియమణి వరుసగా సినిమాలు చేస్తోంది. ఓ వైపు వెబ్ సిరీస్, మరో వైపు సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యకి జోడీగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో బాలయ్యకి జోడీగా ప్రియమణి మిత్రుడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించలేదు.

ఒకవేళ బాబీ సినిమాలో జత కడితే మాత్రం రెండో సినిమా అవుతుంది. అయితే మిత్రుడు సినిమా గతంలో ఫ్లాప్ అయిన నేపథ్యంలో బాలయ్య అభిమానులు ప్రియమణి విషయంలో కాస్తా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి.