Begin typing your search above and press return to search.

ఊటీలో బాల‌య్య వేట‌

చేసిన సినిమాల‌న్నీ క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యాలు అందుకున్న‌వే. దీంతో ఈ కాంబినేష‌న్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:30 PM GMT
ఊటీలో బాల‌య్య వేట‌
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'అఖండ‌'. .'వీర‌సింహా రెడ్డి'..' భ‌గ‌వంత్ కేస‌రి' లాంటి వ‌రుస విజ‌యాల‌తో పుల్ జోష్ లో ఉన్నారు. డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు చేసి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే 109..110..111 చిత్రాల్ని ప్ర‌తిష్టాత్మ కంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే యువ‌త‌రంలో మాస్ కి కేరాఫ్ గా నిలిచిన బాబి ద‌ర్శ‌క‌త్వంలో 109వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు.

భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు.బాల‌య్య మాస్ ఇమేజ్ కి..బాబి మాస్ క్రియేటివిటీ తోడైతే ఎలా ఉంటుందో? బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డానికి రెడీ అవున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాబికి ఒక్క ప్లాప్ కూడా లేదు. చేసిన సినిమాల‌న్నీ క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యాలు అందుకున్న‌వే. దీంతో ఈ కాంబినేష‌న్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ కూడా పూర్త‌యింది. తాజాగా రెండ‌వ షెడ్యూలో ఊటీలో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నెల 24 నుంచి ఊటీలో నిర‌వ‌ధికంగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. దీనిలో భాగంగా బాల‌య్య పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు..ఇత‌ర తారాగ‌ణ‌పై మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారని స‌మాచారం. బాబి సినిమాలంటే హీరో యాక్ష‌న్ ఎలివేష‌న్ స‌న్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న డైరెక్ట్ చేసిన హీరోలంద‌ర్నీ యాక్ష‌న్ ప్ర‌ధానంగా చూపించి కాసుల వ‌ర్షం కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవితో తెర‌కెక్కించిన 'వాల్తేరు వీర‌య్య' కూడా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. రొటీన్ క‌థ‌..క‌థ‌నాలైనా క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో ఆ సినిమా భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. ఇప్పుడు బాల‌య్య‌తోనూ బాబి అదే త‌ర‌హా ప్ర‌య‌త్నం చేస్తుండొచ్చు. బాబి క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉండ‌దు కానీ ..అభిమానుల‌కు కావాల్సిన మాస్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. బాబి స‌క్సెస్ కీ పాయింట్ కూడా అదే.