Begin typing your search above and press return to search.

మరో సర్‌ప్రైజింగ్ మాస్‌ లుక్ లో బాలయ్య!

బాలయ్యను ప్రతి సినిమాలో కూడా దర్శకులు చాలా భిన్నంగా చూపిస్తూ ఫ్యాన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Nov 2023 9:29 AM GMT
మరో సర్‌ప్రైజింగ్ మాస్‌ లుక్ లో బాలయ్య!
X

నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌ మీదున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య తాజాగా భగవంత్ కేసరి సినిమా తో కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య ఈ సినిమాలో కాస్త ఎక్కువ వయసు ఉన్న పాత్రలో గ్రే హెయిర్ తో కనిపించాడు. బాలయ్య ను భగవంత్ కేసరిగా చూసి అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు.

బాలయ్యను ప్రతి సినిమాలో కూడా దర్శకులు చాలా భిన్నంగా చూపిస్తూ ఫ్యాన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య లుక్ ఆధారంగానే సినిమాలు ఆడుతున్నాయి అనే అభిప్రాయం కు కొందరు వస్తున్నారు. అందుకే త్వరలో బాలయ్య తో సినిమాను మొదలు పెట్టబోతున్న దర్శకుడు బాబీ కూడా కొత్త లుక్‌ ను ట్రై చేయబోతున్నాడట.

ఈ మధ్య కాలంలో యూత్‌ లో మంచి ట్రెండ్‌ అవుతున్న లుక్‌ తో పాటు మాస్ ఆడియన్స్ కి చేరువ అయ్యే విధంగా దర్శకుడు బాబీ రెండు మూడు స్కెచ్ లు వేయించాడట. మూడుకి మూడు కూడా బాలయ్య కి నచ్చడంతో మూడు లుక్స్ కి సంబంధించిన టెస్ట్ కి ఓకే చెప్పాడట. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య వచ్చే వారంలో లుక్ టెస్ట్‌ కి డేట్లు ఇచ్చాడట.

బాలయ్య తనను తాను డిఫరెంట్ గా చూసుకునేందుకు ఇష్టపడుతాడు. అందుకే బాబీ మూడు విభిన్నమైన స్కెచ్‌ లు వేయించడం తో సర్ ప్రైజ్ అయ్యాడట. తానే కాదు తన ఫ్యాన్స్ కూడా ఈ లుక్స్ లో తనను చూసి సర్‌ ప్రైజ్ అవుతారు అంటూ దర్శకుడు బాబీ వద్ద బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశాడట. మొత్తానికి బాలయ్య, బాబీ సినిమా గురించి అప్పుడే అంచనాలు పెరిగి పోతున్నాయి.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే అవ్వడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఎవరు నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయంకు హీరోయిన్‌ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.