Begin typing your search above and press return to search.

నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, Jr ఎన్టీఆర్ తప్పితే ఎవరు సక్సెస్ కారా?

తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   13 May 2025 5:51 AM
Nandamuri Ram Debut Creates Buzz  Jr NTR Absence Raises
X

తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఎన్టీఆర్‌తో మొదలైన ఈ ఫ్యామిలీ సినిమా ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. అయితే, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఒక స్పెషల్ స్థాయిలో ఎదిగారు. బాలయ్యకు సంపూర్ణ మాస్ క్రేజ్ ఉంది. అలానే ఎన్టీఆర్‌కి అన్ని వర్గాల్లో అభిమానులున్నారు. ఇద్దరూ పెద్ద ఎన్టీఆర్‌ వారసత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేది అభిమానులు నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉంటారు.

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఫ్యామిలీ ప్రస్థానాన్ని స్ట్రాంగ్ గా ఉంచి బాలయ్య. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బలంగా నిలబడ్డారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. తాత పేరు, గొప్ప కుటుంబ నేపథ్యం ఉండినా, తన స్టైల్‌లోనే ఎదిగాడు. యువహీరోగా సినీ ప్రయాణం ప్రారంభించి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. కానీ తానొక నటుడిగా మాత్రమే కాకుండా మాస్, క్లాస్ ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడు.

ఆరంభంలో ఉన్న కొన్ని అపజయాలను అధిగమించి, ఈరోజు RRR, దేవర లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లో నిలవడం ఆయన అంకితభావానికి నిదర్శనం. ఇతర కుటుంబ సభ్యుల విషయంలో చూస్తే, చాలా మంది వచ్చినా పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. కల్యాణ్ రామ్ ఓ మోస్తరు స్థాయిలో సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ, మాస్ లెవల్లో క్రేజ్ కొంత తక్కువ.

హరికృష్ణ, అలాగే 3వ తరంలో మరికొందరు కొంత కాలం ప్రయత్నించి రిటైర్ అయ్యారు. ఇప్పుడు జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ (రామ్) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ తరానికి చాలా కఠినమైన మార్కెట్ ఇది. మొట్టమొదటి సినిమా నుంచే హిట్ కొట్టాలంటే, కంటెంట్ పక్కాగా ఉండాలి. అందుకే దిశానిర్దేశం చేస్తున్న వైవీఎస్ చౌదరి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంతో అభిమానుల్లో చర్చకు తావిస్తున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. జానకిరామ్ కుమారుడి డెబ్యూ ఫంక్షన్‌కు Jr ఎన్టీఆర్ హాజరుకాలేదు. ఇదే విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. తారక్ తరచూ తన అన్నయ్య జానకిరామ్ గురించి సానుభూతితో మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు అతని కుమారుడి తొలి సినిమా ప్రారంభోత్సవానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

బహుశా తాను వస్తే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గ్రహించి ఉండవచ్చు, లేదంటే RRR ఈవెంట్ కోసం లండన్ ప్లాన్ ముందుగానే సెట్టవ్వడం వలన రాకపోయి ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది ఒక వ్యక్తిగత కారణం కావచ్చునో, లేక పరిస్థితుల కారణంగా ఆలస్యమైందో తెలియదు. కానీ నందమూరి ఫ్యామిలీ అంతర్గత సమైక్యతపై ఫ్యాన్స్ లో నిత్యం కన్ఫ్యూజన్ ఏర్పడుతూనే ఉంటుంది.

అయితే ఎప్పుడూ కొత్త హీరోలకు అవకాశాలు ఇవ్వడంలో టాలీవుడ్ ముందే ఉంటుంది. పేరుంటే చాలు అన్న మద్దతు కాదు. టాలెంట్, కథ, బజ్ అన్నీ కలిసి పనిచేయాలి. బాలకృష్ణ, Jr ఎన్టీఆర్ ఎందుకు టాప్‌ స్టార్స్ అయ్యారో, వాళ్లలో ఉన్న కమిట్‌మెంట్, కథల ఎంపిక, హార్డ్ వర్క్ చూసినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నాలుగో తరం నుంచి వస్తున్న రామ్‌కు కూడా అదే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ లెగసీ ఏదైనా ఉండొచ్చు. కానీ నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల మనసు గెలవాలి.

వైవీఎస్‌కి ఇది మళ్లీ ఓ రీ ఎంట్రీ కూడా. ‘సీతారాముల కల్యాణం చూతాము రారండి’, ‘లాహిరీ లాహిరీ లాహిలో’, ‘దేవదాస్’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఆయన.. చాలా కాలంగా సినిమా తీయలేదు. ఈ ప్రాజెక్ట్‌తో తనకు గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అదే విధంగా రామ్‌కు కూడా సాలిడ్ ప్లాట్‌ఫామ్ కావాలంటే, ఆడియో, టీజర్ స్టేజ్ నుంచే హైప్ ఉండాలి. తొలి సినిమా హిట్ అయితేనే, నందమూరి ఫ్యామిలీ నుండి మరో స్టార్ ఎదిగినట్లు అభిమానులు భావిస్తారు.