మళ్లీ రేస్‌కు రెడీ అవుతున్న కల్యాణ్‌రామ్!
కెరీర్ ప్రారంభం నుంచి న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్.
By: Tupaki Desk | 12 Feb 2026 1:00 AM ISTకెరీర్ ప్రారంభం నుంచి న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఈ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్‌లతో పాటు భారీ డిజాస్టర్లని కూడా చవి చూశారు. అయినా సరే కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం మాత్రం ఆపలేదు. అతనొక్కడే, హరే రామ్, పటాస్ వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని ఇండస్ట్రీకి అందించారు.
కల్యాణ్ రామ్ పరిచయం చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుంటూ హిట్ మెషీన్ అనిపించుకుంటున్నారు.
ఇదే తరహాలో మరి కొంత మంది డైరెక్టర్లని పరిచయం చేశారు కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఫ్లాపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. `బింబిసార`తో వశిష్టని దర్శకుడిగా పరిచయం చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ తరువాత కూడా ముగ్గురు కొత్త డైరెక్టర్లని పరిచయం చేస్తూ కల్యాణ్ రామ్ చేసిన ప్రయోగాలు `అమిగోస్`, ది డెవిల్, అర్జున్ సన్సాఫ్ వైజయంతీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. సక్సెస్ అవుతాయని కల్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాయి.
దీంతో దాదాపు ఏడాది బ్రేక్ ఇచ్చిన కల్యాణ్ రామ్ మళ్లీ రేస్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సారి కూడా మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. కల్యాణ్ రామ్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నది మరెవరినో కాదు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలకు డైలాగ్స్ అందించిన రైటర్ శ్రీకాంత్ విస్సా ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్ రెడీ స్టార్ట్ అయింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని `అర్జున్ సన్సాఫ్ వైజయంతీ` ముప్పా అశోక్ వర్ధన్ నిర్మించబోతున్నాడని తెలిసింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `పుష్ప`తో పాటు పలు హిట్ సినిమాలకు డైలాగ్స్ అందించిన శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ నందమూరి కల్యాణ్‌రామ్‌కు ఎంతగానో నచ్చిందట. గత ఏడాది ఎండింగ్‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినా షూటింగ్‌ని మాత్రం 2026లోనే మొదలు పెట్టాలని ఇన్ని రోజులు ఆగారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్ డేట్‌ని రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ సినిమాల రైటర్గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ విస్సా ఈ సినిమాతో నందమూరి కల్యాణ్ రామ్‌ని మళ్లీ రేస్‌లోకి తీసుకొస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.
