Begin typing your search above and press return to search.

అభిమానిని ఇలా మెడ ప‌ట్టుకుని విసిరేస్తారా?

దీంతో అస‌హ‌నానికి గురైన నానా ప‌ట‌క‌ర్ స‌రిగ్గా నెత్తి మీద ఒక‌టి బ‌లంగా లాగి పెట్టి ఇచ్చాడు. వెంట‌నే ఆయువ‌కుడు ముందుకు తూలి ప‌డ‌బోయాడు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 10:56 AM GMT
అభిమానిని ఇలా  మెడ ప‌ట్టుకుని విసిరేస్తారా?
X

అభిమానుల‌పై అప్పుడ‌ప్పుడు స్టార్లు సైతం చేయి చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. జ‌నాలు గుమ్మిగూడిన స‌మ‌యంలో..ఫోటోలంటూ మీద ప‌డిన సంద‌ర్భంలో స్టార్లు సైతం స‌హ‌నం కోల్పోయి చీవాట్లు పెట్టిన సంద‌ర్భాలెన్నో. మెగాస్టార్ చిరంజీవి..న‌ట‌సింహ బాల‌కృష్ణ‌...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీళ్లంతా అభిమానుల‌పై అప్పుడ‌ప్పుడు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన వారే. కోలీవుడ్లో హీరో సూర్య తండ్రి అయితే ఏకంగా అభిమాని ఫోన్ ని నేల‌కేసి కొట్టి మ‌రీ కోపం చ‌ల్లార్చుకున్నారు.

ఆ త‌ర్వాత అదే అభిమానిని పిలిచి కొత్త ఫోన్ కొనిచ్చారు అనుకోండి. తాజాగా బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ కూడా ఓ అభిమానిపై ఇలాగే చేయి చేసుకున్నాడు. ఓసినిమా షూటింగ్ లో భాగంగా రోడ్డుపై నానాప‌టేక‌ర్ యాక్ష‌న్ పోజిష‌న్ లో నుంచున్నాడు. ముందు కెమెరా ఉంది. అత‌ని చూట్టూ బాడీ గార్డులు..జ‌నాలు కూడా గుమి కూడా ఉన్నారు. మ‌ధ్య‌లో కి ఓయువ‌కుడు హీరోలా ఎంట్రీ ఇచ్చాడు.

చుట్టూ ఉన్న ఎవ‌ర్నీ ప‌ట్టించుకోకుండా నేరుగా నానా ప‌టేక‌ర్ వద్ద‌కు వెళ్లి జేబులో ఫోన్ చేతిలోకి తీసుకుని ప‌ట్టుకుని ప‌టేక‌ర్ ముందు వంగి సెల్పీ ప్లీజ్ అన్నాడు. దీంతో అస‌హ‌నానికి గురైన నానా ప‌ట‌క‌ర్ స‌రిగ్గా నెత్తి మీద ఒక‌టి బ‌లంగా లాగి పెట్టి ఇచ్చాడు. వెంట‌నే ఆయువ‌కుడు ముందుకు తూలి ప‌డ‌బోయాడు. ఇంత‌లో ప‌క్క‌నే ఉన్న బాడీ గార్డ్ ప‌డ‌కుంటా మెడ‌ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తోసేసాడు.

ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ యువ‌కుడిపై ఇద్ద‌రు చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఎంత షూటింగ్ అయితే మాత్రం అలా అమాయ‌కుడిపై చేయి చేసుకోవ‌డం అన్న‌ది త‌ప్పు అంటూ నెటి జ‌నులు నానా ప‌టేక‌ర్ తీరుపై మండిప‌డుతున్నారు. ఆ బాడీగార్డ్ అతిగా రియాక్ట్ అయ్యాడు ..ఇలాంటి వాళ్ల‌ను సినిమా వాళ్ల‌ను ఎందుకు ప‌క్క‌న‌బెట్టుకుంటారంటూ మండిప‌డుతున్నారు. నిజానికి ఆ యువ‌కుడుకి అక్క‌డ ఏం జ‌రుగుతుంతో తెలియ‌క మ‌ధ్య‌లోకి వెళ్లిన‌ట్లు ఉంది త‌ప్ప‌! అంతకు మించి యువ‌కుడిని త‌ప్పుబ‌ట్ట‌డానికి లేదు. ఈ ఘ‌ట‌న వార‌ణాసిలో చోటు చేసుకుంది.