Begin typing your search above and press return to search.

శ్రీదేవిలా నానా ప‌టేక‌ర్ జ‌క్క‌న్న చిత్రంలో ఛాన్స్ మిస్!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. భారీ కాన్సాస్ పై తెర కెక్కుతోన్న చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   29 May 2025 6:13 AM
శ్రీదేవిలా నానా ప‌టేక‌ర్ జ‌క్క‌న్న చిత్రంలో ఛాన్స్ మిస్!
X

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. భారీ కాన్సాస్ పై తెర కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇందులో మ‌హేష్‌, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ స‌హా ప్ర‌ధాన పాత్ర ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం రెండ‌వ షెడ్యూల్ కు సంబంధించి ప‌నులు జ‌రుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ను టీమ్ అప్రోచ్ అయిందిట‌. కానీ ఆ పాత్ర‌ను నానా ప‌టేక‌ర్ రిజెక్ట్ చేసార‌ని స‌మాచారం. పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న తిర‌స్క రిం చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజమెంతో తెలియాలి. నానా ప‌టేక‌ర్ ప్రోఫెష‌న‌ల్ యాక్టర్. బాలీవుడ్ లో సీనియ‌ర్ న‌టుడు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది.

మ‌రి ఈ తిర‌స్క‌ర‌ణ నిజ‌మైతే అందుకు గ‌ల అస‌లైన కార‌ణాలు ఏంటి? అన్న‌ది తెలియాలి. `బాహుబ‌లి` సినిమా విష‌యంలో అతిలోక సుంద‌రి శ్రీదేవికి ఇలా రాజ‌మౌళి గొప్ప పాత్ర‌ను ఆప‌ర్ చేసిన సంగ‌తి తెలి సిందే. ర‌మ్య‌కృష్ణ పోషించిన శివ‌గామి పాత్ర‌ను శ్రీదేవి పోషించాలి. కానీ అధిక పారితోషికం డిమాండ్ తో పాటు, కొన్ని సందేహాలు కూడా వ్య‌క్తం చేయ‌డంతో? శ్రీదేవి ఆలోచ‌న విర‌మించుకుని ర‌మ్య‌కృష్ణ‌ని రాజ‌మౌళి రంగంలోకి దించారు.

ఈ నేప‌థ్యంలో నానా ప‌టేక‌ర్ రిజెక్ష‌న్ నిజ‌మైతే? అత‌డికి త‌గ్గ న‌టుడ్ని జ‌క్క‌న్న రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఆ పాత్ర ఎవ‌ర్ని వ‌రిస్తుంద‌న్న‌ది చూడాలి. గ్లోబ‌ల్ స్థాయిలో రాజ‌మౌళికంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలో అవ‌కాశం వ‌చ్చిందంటే? వ‌దులుకోవ‌డానికి ఏ న‌టుడు సిద్ద‌ప‌డ‌డు. కొంత మంది మాత్రమే అలాంటి సాహ‌సం చేయ‌గ‌ల‌రు.