Begin typing your search above and press return to search.

మాధురి దీక్షిత్ లా ఎప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌ని!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:47 PM GMT
మాధురి దీక్షిత్ లా ఎప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌ని!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. నిత్యం ఫ్యామిలీ విష‌యాలు షేర్ చేస్తూ అభిమానుల్ని అల‌రిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో న‌మ్ర‌త కూడా గేర్ మార్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇన్ స్టా యాక్టివిటీని మ‌రింత స్పీడ‌ప్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. కుమార్తె సితార త‌ర‌హాలో న‌మ్ర‌త కూడా నేను సైతం అంటున్నారు. సితార ఫోటోల‌తో పాటు న‌మ్ర‌త ఫోటో షూట్లు సైతం త‌రుచూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.


డిజైన‌ర్ దుస్తుల్లో న‌మ్ర‌త న‌వ నాయిక‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా రేసులో నిలుస్తున్నారు. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసారు. ఇదిగో ఇక్క‌డిలా ఆల్ట్రామెడ్ర‌న్ దుస్తుల్లో ఆకర్షిస్తున్నారు. క్రీమ్ క‌ల‌ర్ డిజైన్ లో న‌మ్ర‌త ఓ ఈవెంట్ కి హాజ‌రైనప్పుడు ఇలా ముస్తాబై వెళ్లారు. న‌మ్ర‌త ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ మ‌రింత బ్యూటీని జోడించాయి. కాళ్ల‌కు మ్యాచింగ్ న‌లుపు రంగు బూట్లు ధ‌రించి స్టైల్ కా బాప్ అనిపించేలా కొన్ని భంగిమ‌ల్లో కెమారాకి ఫోజులిచ్చారు.

యాభై ఏళ్ల వ‌య‌సులోనూ న‌మ్ర‌త మాధురి దీక్షిత్ లా ఎప్ప‌టికీ మ‌రువ‌ని నాయిక అంటూ కొత్త ట్యాగ్ ని సొంతం చేసుకుంటున్నారు. నిజానికి న‌మ్ర‌త చేసింది కొన్ని సినిమాలే. మ‌హేష్ ని వివాహం చేసుకున్న త‌ర్వాత పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయారు. అవకాశాలు వ‌చ్చినా..ఇచ్చినా మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చేదే? లేద‌ని ఎన్నోసార్లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పారు.

చాలా కాలం పాటు మీడియాకి కూడా దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అదే మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతుండ‌టం ఇంట్రెస్టింగ్. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. న్యూ డిజైన్ లో చూసిన అభిమానులు లైక్ లు..షేర్ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. కామెంట్ బాక్స్ లో పోస్టులు అంతే ఆస‌క్తిక‌రం.