Begin typing your search above and press return to search.

స్పోర్స్ట్ దుస్తుల్లో న‌మ్ర‌త ఇన్ని సందేహాలా?

అప్పుడ‌ప్పుడు వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం.. మ‌హేష్ ఈవెంట్లు స‌హా సామాజిక కార్య‌క్ర‌మాలు ఏవైనా ఉంటే హాజ‌రవ్వ‌డంతో త‌ప్ప న‌మ్ర‌త బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌రు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 6:34 AM GMT
స్పోర్స్ట్ దుస్తుల్లో న‌మ్ర‌త ఇన్ని సందేహాలా?
X

సూప‌ర్ స్టార్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టంతో పాటు ...కుటుంబ వ్య‌వ‌హారాన‌ల్ని తానే స్వ‌యంగా ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. మ‌హేష్‌.. గౌత‌మ్.. సితార ప్ర‌పంచంగా జీవిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం.. మ‌హేష్ ఈవెంట్లు స‌హా సామాజిక కార్య‌క్ర‌మాలు ఏవైనా ఉంటే హాజ‌రవ్వ‌డంతో త‌ప్ప న‌మ్ర‌త బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌రు.


వీలైనంత వ‌ర‌కూ సోష‌ల్ మీడియా ద్వారానే అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటారు. అలాగే ఫ్యాష‌న్ ఎంపిక‌ల ప‌రంగానూ చాలా నిరాడంబ‌రంగా ఉంటారు. దుస్తుల ప‌రంగా మ‌రీ అంత స్లైలింగ్ చేయ‌రు. ఎక్కువ‌గా ట్రెడీష‌న‌ల్ దుస్తుల్లోనే క‌నిపిస్తుంటారు. అలాంటి న‌మ్ర‌త చాలా కాలం త‌ర్వాత స్పోర్స్ట్ దుస్తుల్లో అందులోనూ జిమ్ములో క‌నిపించ‌డం ఇంట్రెస్టింగ్. అవును ఉదాయ‌న్నే న‌మ్ర‌త వ‌ర్కౌట్ అనంత‌రం ఇలా రిలాక్స్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది ఈ పిక్ లో.

ముందు వాట‌ర్ బాటిల్ ప‌ట్టుకుని సిప్ కొడుతూ వ‌ర్కౌట్లు అనంత‌రం ఇలా రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడామె ఫిట్ నెస్ పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు క‌నిపిస్తుంది. మునుప‌టి క‌న్నా ఆమె లో కొన్ని ర‌కాల మార్పులు..స్లిమ్ గానూ క‌నిపిస్తున్నారు. అయితే ఆమె లుక్ ఛేంజ్ అవ్వ‌డం కాదుగానీ! ఈ పిక్ మాత్రం చాలా సందేహాలకు దారి తీస్తోంది. నమ్ర‌త‌ని ఇలా చూసిన వారంతా? ఎస్ ఎస్ ఎంబీ 29 లో వ‌దిన‌మ్మ హీరోయిన్ ఎందుకు అవ్వ‌కూడదు అనేస్తున్నారు.

మ‌హేష్ స‌ర‌స‌న మ‌రో సినిమా చేస్తే చూడాల‌ని ఉందంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇంకా న‌మ్ర‌త కంబ్యాక్ కోస‌మే ఇలా స‌న్న‌ధం అవుతున్నారు? అంటూ మ‌రింత బ‌లంగా చెప్పే అభిమా నులు ఎంతో మంది. ఏది ఏమైనా ఈపిక్ చాలా సందేహాల‌కు దారి తీస్తుంది. మ‌రి వీట‌న్నింటికి తెర దించాలంటే న‌మ్ర‌త నుంచి క్లారిటీ నుంచి రావాల్సిందే. అయితే చాలా సంద‌ర్భాల్లో మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకునే అవ‌కాశం ఉందా? అంటే న‌మ్ర‌త నో వే అనేసిన సందర్భాలెన్నో.